Aravind Srinivas
-
ఇంక సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చేస్తారు?
సాంకేతిక రంగంలో కొలువుల కోత భయాలు నిజమవుతున్నాయా? గతంలో కేవలం సాధారణ పనులకే పరిమితమైన కృత్రిమ మేధ (AI), ఇప్పుడు హై-టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) రంగాల్లో పనిచేసే వారి భవితవ్యంపై పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.'ప్రాపంచిక' పనులకు ఇక స్వస్తి..ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పెర్ప్లెక్సిటీ' సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ (X) వేదికగా టెక్ పరిశ్రమలో రాబోయే మార్పులపై కుండబద్దలు కొట్టారు. "సాఫ్ట్వేర్ ఉత్పత్తుల టెస్టింగ్, నాణ్యతను అంచనా వేయడం (QA) వంటి ప్రాపంచిక పనులు (Mundane Jobs) క్రమంగా కనుమరుగవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆ కోడ్‌ను తనిఖీ చేసే బాధ్యతను కూడా ఏఐ తన భుజాన వేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.రంగంలోకి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'పెర్ప్లెక్సిటీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' అప్డేట్ ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ సాధనం వెబ్ అప్లికేషన్లను నిర్మించడమే కాకుండా, వాటిని స్వయంగా పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఆటోమేటెడ్ టెస్టింగ్ : 'ప్లేరైట్' (Playwright) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా క్వాలిటీ చెకర్ అవసరం లేకుండానే అప్లికేషన్‌ను రన్ చేస్తుంది.మానవ ప్రమేయం అక్కర్లేదు: ఒక సాధారణ వినియోగదారు యాప్‌ను ఎలా ఉపయోగిస్తారో, ఈ AI సిస్టమ్ కూడా అలాగే యాప్‌ను తనిఖీ చేసి, లోపాలను (Bugs) గుర్తిస్తుంది.క్షణాల్లో పరిష్కారం: డెవలపర్లు జోక్యం చేసుకోకముందే సమస్యలను గుర్తించి, వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లోనే పరిష్కరించేలా ఈ టూల్‌ను రూపొందించారు. -
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్మాన్, అరవింద్ శ్రీనివాస్‌లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు -
వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?
భారతదేశపు అతి పిన్న వయసున్న బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్(31)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నైలో జన్మించిన ఈయన పెర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.21,190 కోట్ల (సుమారు $2.5 బిలియన్లు) నికర విలువతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తమిళనాడులోని చెన్నైలో పెరిగిన అరవింద్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ పట్ల అభిరుచి పెంచుకున్నారు. తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ సంపాదించారు. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ తన నైపుణ్యాలను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలతో కలిసి మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో OpenAI, గూగుల్, డీప్ మైండ్ల్లో పనిచేశారు. ఇక్కడ అతను అత్యాధునిక ఏఐ నమూనాలు, ఎల్ఎల్ఎం(లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్)పై అనుభవం సాధించారు. ఇది అతని సొంత కంపెనీ స్థాపనకు కీలకంగా మారింది.పెర్ప్లెక్సిటీ ఏఐ2022లో శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్వినిస్క్తో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐను స్థాపించారు. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు. ఇది ఒక ఇంటెరాక్షన్ ఏఐ సెర్చ్ ఇంజిన్. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి వేగవంతమైన మార్గంగా దీన్ని శ్రీనివాస్ అభివర్ణించారు. మార్కెట్లో తన పోటీదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా పెర్ప్లెక్సిటీ నిలుస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా హైపర్లింక్ల జాబితాను అందించడానికి బదులుగా పెర్ప్లెక్సిటీ ప్రత్యక్ష, ఇంటెరాక్షన్ సమాధానాలను అందిస్తుంది. ఇది మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐను రియల్‌టైమ్ వెబ్ డేటాతో విలీనం చేస్తుంది. ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో గుర్తింపు లభించింది. ఈ స్టార్టప్‌కు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో సహా అగ్రశ్రేణి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమకూరాయి.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?


