Arches
-
మెచ్చేలా.. ముచ్చటగా.. అటు ఇంటికి అలంకరణ, ఇటు ఉపాధి
సాక్షి, అమలాపురం: పంటభూమిలో ఆరుగాలం చెమట చిందించి, పండించే ధాన్యాన్ని రైతు ఎంతో అపురూపంగా భావిస్తాడు. రెక్కల కష్టంతో దక్కిన ఫలితంలో కొంత భాగాన్ని దేవునికి పరమ భక్తితో నివేదిస్తాడు. తన కుటుంబ జీవనానికి ఊతంగా నిలిచి.. సిరులు కురిపించే వరి కంకులతో ఇళ్లను ముచ్చటగా.. చూసిన వారు మెచ్చేలా.. ముస్తాబు చేసుకుని మురిసిపోతాడు. వరి కంకులను అందంగా అల్లి తయారు చేసే ధాన్యం కుచ్చులను వీధిలో వేలాడదీసే వారు కొందరైతే... తోరణాలుగా చేసి సింహద్వారానికి అలంకరించే వారు మరికొందరు. దేవాలయాల్లో సైతం ఇలా కుచ్చులు కట్టడం, ఆలయ సింహద్వారాలకు తోరణాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఏటా సంక్రాంతి సమయంలో పచ్చని కోనసీమలో జరిగే తీర్థాలకు భక్తుల భుజస్కంధాలపై వెళ్లే ప్రభలకు సైతం ధాన్యం కుచ్చులు తగిలించి, తాము పండిచిన ధాన్యాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పిస్తూంటారు. ప్రకృతి ప్రేమికులు సైతం ధాన్యం కుచ్చులను వీధుల్లో ఉంచి, పక్షులకు ఆహారంగా అందిస్తూంటారు. పక్షులకు ఆహారంగా.. పక్షులకు ఆహారంగా అందించేందుకు సైతం పలువురు ధాన్యం కుచ్చులను ఇళ్లు, ఆలయాలు, పంట పొలాల వద్ద ఉండే రైతుల ఇళ్ల (మకాం) వద్ద విరివిరిగా ఏర్పాటు చేస్తున్నారు. కొందరు ప్రకృతి ప్రేమికులు పక్షుల సందడి అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఉంచుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన పెనుమాక మహాలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఆయన ఆరు దశాబ్దాల పాటు పక్షులకు ఆహారంగా ధాన్యం కుచ్చులను అందుబాటులో ఉంచారు. ఊళ్లోని ఆలయాలకు, చెట్లకు, నాలుగు రోడ్ల కూడళ్లలోని స్తంభాలకు, ఎత్తయిన భవనాలకు కుచ్చులు కట్టి, పక్షులకు ఆహారంగా అందించేవారు. ‘ఊపిరి ఉన్నంత వరకూ కుచ్చులు కట్టి, పక్షులకు ఆహారం అందిస్తాను’ అని ఆయన తరచూ అనేవారు. ఆ మాటను అక్షరాల నిజం చేశారు. చేయి తిరిగిన వారే చేయగలరు రబీ వరి కోతలు జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వరి కుచ్చులు తయారు చేస్తూ పలువురు బిజీ అయిపోయారు. వీటిని తయారు చేయడం అంత సులువేమీ కాదు. గతంలో వీటిని తయారు చేయడానికి ప్రత్యేకంగా కొందరు ఉండేవారు. ఆ తరం దాదాపు తగ్గిపోవడంతో కొన్నాళ్లు కంకుల కుచ్చులు కూడా కనుమరుగయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీంతో పలువురు పెద్ద తరం వారి వద్ద నేర్చుకుని వరి కుచ్చులు, తోరణాల తయారీ విరివిగా చేపడుతూ ఉపాధిగా పొందుతున్నారు. కోత కోసిన తరువాత ధాన్యం పరకలను ప్లాస్టిక్ తాడు లేదా పురికొసకు ఒకదాని తరువాత ఒకటిగా వేలాడదీస్తూ కడతారు. తరువాత అన్నిటినీ కలిపి గుండ్రంగా చుట్టడం ద్వారా ధాన్యం కుచ్చు తయారు చేస్తారు. ఇది పూర్తయిన తరువాత గడ్డి చూరులు లేదా పురికొసను తాడుగా తయారు చేసి ధాన్యం కుచ్చులను ముస్తాబు చేస్తారు. ప్రస్తుతం వరి కుచ్చులను ఇంటి ముందు పెట్టాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికీ విపరీతంగా పెరిగింది. పల్లెల కంటే పట్టణ వాసులే ధాన్య కుచ్చులపై ఆసక్తి చూపుతూండటం విశేషం. పలు ప్రాంతాల్లో ధాన్యం కుచ్చులు, తోరణాలు తయారు చేసి రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకూ ఆదాయం పొందుతున్నారు. కొంతమంది వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు తీసుకు వెళ్తున్నారు. కుచ్చులతో ఉపాధి అంబాజీపేట మండలం జి.అగ్రహారానికి చెందిన ఆకుమర్తి వేమ సుందరరావు ధాన్యం కుచ్చులు, పండ్లకు బుట్టలు కట్టి ఉపాధి పొందుతున్నారు. అంతకు ముందు దినసరి కూలీగా ఉండే సుందరరావు ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. తరువాత ఇంటి వద్దనే ఉంటూ ఈ పని చేస్తున్నారు. ‘వరి పనలు తెచ్చి చాలా మంది నా వద్ద కుచ్చులు తయారు చేయించుకుంటారు. సైజును బట్టి రూ.150 నుంచి రూ.500 వరకూ ఇస్తుంటారు’ అని సుందరరావు చెప్పారు. -
పేపర్ కప్స్ తోరణం
దీపాల పండుగకు రంగు రంగుల అలంకరణ వస్తువులను సిద్ధం చేసుకునే పనిలో ఉండే ఉంటారు. ముఖ్యంగా విద్యుత్ తోరణాల జిలుగులకు ఎంతో ఖర్చు పెడుతుంటారు. తమదైన సృజన జోడించి పేపర్ కప్స్తో అందమైన తోరణాలను ఎవరికి వారు సిద్ధం చేసుకోవచ్చు. ►పార్టీలలో నీళ్లు, టీ, కూల్డ్రింక్స్ కోసం ఒకసారి ఉపయోగించి పడేసే పేపర్ కప్స్ని ఎక్కువ మొత్తంలో కొనేసి, వాడకుండా ఉన్నవి పక్కన పెట్టేస్తుంటారు. వాటిని ఈ విద్యుత్ తోరణాలకు వాడచ్చు. వాడేసిన కప్పులనూ తిరిగి ఇలా అందమైన తోరణాలుగా తయారుచేసుకోవచ్చు. ►ఒక్కో కప్పుకు ఒక్కో పెయింట్ వేయాలి. కప్పు అడుగు భాగాన చిన్న రంధ్రం చేయాలి. విద్యుత్ దీప తోరణాలకు ఈ కప్పులను జత చేయాలి. (లైట్ ఉన్న చోట కప్పును ఫొటోలో చూపిన విధంగా ఇలా తిరిగేసి తొడగాలి) ►రంగేసిన టీ కప్పులకు పూసలు, చమ్కీలు, అద్దాలు ఉపయోగించి అందమైన తోరణాన్నీ తయారుచేసుకోవచ్చు. ఈ పేపర్ కప్స్ తోరణాలకు ఖర్చూ తక్కువే. వాడేసిన వాటిని తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని తగ్గుతుంది. -
గుమ్మాలకు మామిడి తోరణాలెందుకు?
భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది, మరెంతో శాస్త్రీయమైనది. మన సంస్కృతిలోని ఆచారాలన్నీ అద్భుతమైన ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉండటం విశేషం. దానిలోని అంతస్సూత్రం తెలీనివారికి చాదస్తంగా అనిపించవచ్చు, కానీ అంతరార్థం తెలిస్తే, అంతా నిజమేనని అంగీకరించక తప్పదు..ఇంటిగుమ్మాలకు కట్టే మామిడాకుల తోరణాలతో ముందుగా ప్రారంభిద్దాం. ప్రతిపండగకూ ఇంటి సింహద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం మనకు తెలుసు కదా! పెళ్ళిళ్ళూ, వ్రతాలు జరిగేప్పుడు వాకిలిముందరి స్తంభాలకు అరటిచెట్లు, పూజామందిరానికి అరటిపిలకలు కడతారు. పూర్వం పల్లెల్లో తప్పని సరిగా కొబ్బరిమట్టలు స్తంభాలకు కట్టేవారు.ఇది ఒక చాదస్తమా! లేక ఏదైనా ఉపయోగం ఉందా! చాలామంది ఒకచోట చేరినపుడు అంతా విడిచే బొగ్గు పులుసువాయువు (కార్బన్ డై ఆక్సైడ్ వల్ల గాలి కలుషితమై, ఊపిరాడక పోవడం, తలతిరగటం తలనొప్పి రావటం జరుగుతుంటాయి. అందుకే ముఖ్యంగా పసిపిల్లలు ఇలాంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో దారుణమైన ఉక్కపోత, వేడిమికి గురై, ఊపిరి బిగదీసినట్లై గుక్కపట్టి ఏడస్తుంటారు. దీన్నే ఆంగ్లంలో ‘సఫకేషన్‘అంటారు. ఈ మామిడి, అరటి, కొబ్బరి ఆకుల్లో చెట్టునుంచి కోశాక కూడా చాలాసేపటి వరకూ కార్బన్ డై యాక్సైడ్ను పీల్చుకుని, ఆక్సిజన్ను వదిలే గుణం ఉంటుంది. అందువల్ల ఊపిరాడకపోడం జరగదు. అంతేకాక ఈ ఆకులలోని ఆకుపచ్చరంగు కంటికి ఆహ్లాదాన్ని, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సహజరీతిలో అలంకారంతో పాటుగా, ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి. చూశారా... ఈ మామిడాకులు, తోరణాలవల్ల ఎంత మేలు జరుగుతుందో! ఇంటి గుమ్మాలకు ముఖ్యంగా సింహద్వారాలకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెట్టడం, ఇంటిలోకి దేవిని స్వాగతించడం! పసుపు యాంటీబయాటిక్ సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. నోములూ వ్రతాల సమయంలో మహిళల పాదాలకు పసుపు రాసేవారు, మహిళలు ఎక్కువగా నీళ్ళలో పని ఉంటుంది, ఈ పసుపు రాసుకోడం వల్ల కాళ్లు, వేళ్లు పాయటం వంటివి జరగదు. . శరీరానికీ మహిళలు పసుపురాసుకుని స్నానంచేసేవారు. దీనివల్లా శరీరానికి రంగురావటమేకాక అనవసర కేశాలు రాలిపోతాయి. ఇదేవిధంగా పెళ్లిళ్లలో కర్పూరపు దండలు అని ఇచ్చేవారు. వీటిలో కూడా బయటి గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకుని, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే గుణం ఉంది. అందుకే వివాహాది శుభకార్యాలలో కర్పూరపు బంతులను ప్రతి ఒక్కరికీ ఇస్తుంటారు. వధూవరులకు మెడలో తప్పనిసరిగా వీటిని ధరింపజేస్తుంటారు. వీటితోబాటు వెనకటి రోజుల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు అందరికీ తలొక తాటాకు విసన కర్రా ఇచ్చేవారు. వీటినుంచి వీచే గాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ విసన కర్రలు తడిసినా కూడా మంచి వాసన వేస్తుంది. చల్లటి గాలి వంటికి తగులుతుంది. -
ప్రతిపక్షంలో కూర్చున్న కవి
యుద్ధం ముగిసిందని సిపాయిలు నిద్రపోయారు విజయం సాధించామని జనం ఆనందంలో మునిగిపోయారు పడుతూ లేస్తూ నడిచినవాళ్లు జెండాలు పెకైత్తి పట్టుకొన్నారు కష్టాలను నష్టాలను ఓర్చుకున్నవాళ్లు కలల్లో తేలియాడారు దెబ్బలు తిన్నవాళ్లను నెట్టేసుకుంటూ తెలివైనవాళ్లు పూలగుచ్ఛాలందుకొన్నారు తోరణాలు కడుతూ నగరమంతా తిరిగిన కవికి అర్ధరాత్రి ఆకలేసింది ఎవర్ని పిలిచిన బహుమతి ప్రదానాల్లో మరిచి ఒక్కరూ తిరిగి చూడలేదు ఎగిరిపోయిన డైరీ పేజీలు ఏరుకుని గుర్రాలు పారిపోయిన బగ్గీ పక్కన రాత్రి గడిపాడు అద్దం పగిలిన గడియారాన్ని ముద్దాడి యుద్ధానికి ముందు వినిపించిన అగ్గినొకసారి చదువుకొన్నాడు శత్రు సంహారం తర్వాత కూడా అదే కవిత అవసరమైనందుకు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. - ఆశారాజు, 9392302245