జైలు నుంచి ఆక్వా ఉద్యమకారులు విడుదల
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ జైలు నుంచి మెగా ఆక్వా పార్కు ఉద్యమకారులు ఆరుగురు మంగళవారం విడుదలయ్యారు. గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడంతో పోలీసులు పలువురిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.
50 రోజులుగా జైలులో ఉన్న ఆరేటి వాసు, ముచ్చెర్ల త్రిమూర్తులు, బెల్లపు సుబ్రహ్మణ్యం, కొయ్యే మహేష్, కలిగిత సుందరావులకు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఉద్యమకారులకు ఆక్వాపుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌జైలు నుంచి తుందుర్రు బాధితురాలు ఆరేటి సత్యవతి కూడా నిన్న బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే.