Arikala narsa reddy
-
టీఆర్ఎస్లో చేరిన అరికెల నర్సారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మా జీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడి ఆయన నివాసంలో నర్సారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరికెల మాట్లాడుతూ తన అనుచరులను, కాంగ్రెస్ క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు త్వరలోనే స్థానికంగా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఆయన టీఆర్ఎస్లో చేరడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నర్సారెడ్డికి టీఆర్ఎస్ సముచిత గౌర వం కల్పిస్తుందని తెలిపారు. -
‘నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ చేస్తున్న పనులకు పొంతనే లేదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు.