సాక్షి, హైదరాబాద్: మా జీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడి ఆయన నివాసంలో నర్సారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరికెల మాట్లాడుతూ తన అనుచరులను, కాంగ్రెస్ క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు త్వరలోనే స్థానికంగా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నర్సారెడ్డికి టీఆర్‌ఎస్ సముచిత గౌర వం కల్పిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment