చంద్రబాబు సభ వద్ద ఆందోళన
విశాఖపట్నం: ఆరిపాకలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభ వద్ద డ్వాక్రా మహిళలు, ఐకేపీ యానిమేటర్లు ఆందోళనకు దిగారు. రుణాలు మాఫీ చేయమని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అదే సభలో తమ సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ యానిమేటర్లు కూడా ఆందోళన చేశారు.
చీపురుపట్టిన చంద్రబాబు
ఇదిలా ఉండగా, సబ్బవరం జంక్షన్లో స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చీపురుపట్టుకొని రోడ్లు ఊడ్చారు.
**