Ariyalur district
-
అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండుసార్లు పారిపోయి..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధంలో ప్రియుడు తన తండ్రితో కలసి ప్రియురాలిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడితోతోపాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. అరియలూరు జిల్లా తాపలూ ర్కు చెందిన శక్తివేల్ కూలి పనిచేసి, జీవిస్తున్నా డు. ఇతనికి భార్య సత్య (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మేల్కుడికాడు గ్రామానికి చెందిన అమృతరాజ్ (24)తో సత్య కు వివాహేత సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి వెల్లకోయిల్కు వెళ్లింది. అయితే శక్తివేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సత్యను గుర్తించి, ఆమెను మందలించి భర్తతో కలిసి జీవించమని పంపించారు. అయితే ఆ తర్వాత సత్యకు అమృతరాజ్ తమ్ముడు దేవాతో వివాహేతర సంబంధం ఏర్పడి, అతనితో సత్య పారిపోయింది. దీంతో విసిగిపోయిన శక్తివేల్ తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదలిపెట్టి పని కోసం మలేషియా వెళ్లాడు. ఈ క్రమంలో మామ ఇంట్లో ఉన్న సత్యకు అమృతరాజ్కు మధ్య డబ్బు వ్యవహారంలో గొడవ ఏర్పడింది. దీంతో అమృతరాజ్ అతని తండ్రి దేవేంద్రన్ కలసి సత్యపై కత్తితో దాడి చేసి, హతమార్చారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అమృతరాజ్ అతని తండ్రి దేవేంద్రన్ (57)ను అరెస్టు చేసి, విచారణ జరపుతున్నారు. చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..! -
ఫేస్బుక్ సెల్ఫీతో బుక్కయ్యాడు!
తిరుచ్చి: భార్యకు హత్య చేసి పారిపోయిన భర్త ఏడేళ్ల తర్వాత అనుహ్యంగా పట్టుబడ్డాడు. ఫేస్బుక్ లో సెల్ఫీ పోస్టు చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మణి(45) తన భార్యతో కలిసి తమినాడులోని అరియలూర్ జిల్లా నన్నియూరులో కాపురం పెట్టాడు. మణి తరచుగా తన భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. 2009, ఆగస్టులో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోపంలో భార్య గొంతు కోశాడు. తర్వాత అక్కడి నుంచి చెన్నెకు పారిపోయాడు. కందస్వామిగా పేరు మార్చుకుని తొండియార్ పేటలో హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్నాడు. అయితే కేరళలో పనిచేస్తూ తమ కొడుకు మృతి చెందాడని పోలీసులతో మణి తల్లిదండ్రులు నమ్మబలికారు. అయితే ఫేస్బుక్ లో మణి సెల్ఫీ చూసిన అతడి బంధువు షాక్ తిన్నాడు. మరో నలుగురితో కలిసి మణి పనిచేస్తున్న హోటల్ కు వెళ్లాడు. వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారి అనుమానం నిజమైంది. మణి బతికే ఉన్నాడని నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారని అరియలూర్ డీఎస్పీ పి. ముత్తుకరప్పన్ తెలిపారు. బుధవారం అతడిని అరియలూర్ కు తరలించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు తిరుచ్చి సెంట్రల్ జైలులో ఉన్నాడు.