ఆర్మీ వైద్యులకు వేతనాల పెంపు.. కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆర్మీలో పనిచేస్తున్న వైద్యాధికారులు, వైద్య నిపుణులకు పెరిగిన వేతనాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మొదటి సంవత్సరంలో ఓఐసీ (ఆఫీసర్ ఇంచార్జ్ పాలీక్లినిక్స్), దంత, వైద్య అధికారులకు రూ.75 వేలు, మిగతా నిపుణులందరికీ రూ. 87 వేలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.
ఈసీహెచ్ఎస్ (ఎక్స్–సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్) పాలీక్లినిక్స్కు రెండో ఏడాది రూ.లక్ష చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ పెంచిన వేతనాలు ఆగస్ట్ 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా, మెరుగైన వైద్యుల కోసం ఈసీహెచ్ఎస్ ఎదురుచూస్తోందని ఆర్మీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అడిషన్ డైరెక్టరేట్ జనరల్ పేర్కొన్నారు.