article 371 d
-
మాకు 371- డి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డీ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు ఉన్నందున తమను నీట్ నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టుకు ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ ప్రభుత్వం విన్నవించాయి. ఈ హక్కులను కొనసాగించేలా.. పునర్ వ్యవస్థీకరణ చట్టం పదేళ్ల పాటు ప్రస్తుతం ఉన్న అడ్మిషన్లను యథాతథంగా కొనసాగించుకునే హక్కును కల్పించినందున తమకు నీట్ వర్తించబోదని వాదించాయి. ఇప్పటికే ఎంసెట్ నిర్వహించుకున్నామని, వాటి ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నాయి. ‘నీట్’ నుంచి తమను మినహాయించాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్లపై జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పలు రాష్ట్రాల వాదనలు విన్నది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ సాగింది. ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి: ఏపీ ఉన్నత విద్యామండలి తరపున సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టిక్ 371-డి ద్వారా ఏపీ, తెలంగాణల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్థానికతపై రిజర్వేషన్లు ఉన్నాయని వివరించారు. ‘ఈ నిబంధనలు కొనసాగేలా విభజన చట్టం-2014 సెక్షన్ 95లో ఏపీ, తెలంగాణలో మరో పదేళ్లపాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అప్పటికే ఉన్న ప్రక్రియను కొనసాగించాలన్నారు. అప్పటికి అమలులో ఉన్న ఎంసెట్ ద్వారా ఏపీలో వైద్య విద్యకు ప్రవేశాలు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది: అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున బసవ ప్రభు పాటిల్ వాదిస్తూ ‘తెలుగు మీడియం విద్యార్థులు నీట్ ద్వారా ఇబ్బంది పడతారు. విద్యార్థులు నష్టపోవడమే కాక ఇప్పటికిప్పుడు సిలబస్‌లోని అంతరాలను పూడ్చడం, పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తేవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులు కూడా మాకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాయి.. అందువల్ల ఏపీకి నీట్ వర్తించదు..’ అని వాదించారు. చివరగా తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు విచారిస్తామని, అందరూ ఒక్కో పేజీలో తమ వాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరేన్రావల్ రెండు నిమిషాల సమయం కోరినా కోర్టు సమ్మతించలేదు. రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదు..: కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదని, కేవలం స్థానిక చట్టాల ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. చివరగా ఎంసీఐ తరపున వికాస్ సింగ్ వాదిస్తూ ప్రైవేటుమెడికల్ కళాశాలలు పరీక్షలు నిర్వహించుకునే విధానానికి స్వస్తి పలికేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉండాలని కోరగా.. జస్టిస్ అనిల్ దవే స్పందిస్తూ ప్రైవేటు కళాశాలలు పరీక్షలు నిర్వహించుకునే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు. -
ఏపీలో జోనల్ రగడ!
-
మంగళయాన్ స్పీడులో బిల్లు పంపిస్తాం: కిరణ్
హైదరాబాద్: విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 371(డీ) రాజ్యాంగ సవరణ అవసరమని రాష్ట్రపతి ఇచ్చిన నోట్లో వుందని మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ప్రతి క్లాజ్‌పైనా శాసనసభలో ఓటింగ్, అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. విభజన బిల్లును కేంద్రం జెట్‌స్పీడులో రాష్ట్రానికి బిల్లు పంపితే, మంగళయాన్ స్పీడులో తిరిగి పంపిస్తామని ఆయన చమత్కరించారు. నీటి పంపకాల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. కేంద్రం పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లు ఇంగ్లీషులో ఉందని, దీన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసముందని అభిప్రాయపడ్డారు. మరో రెండు గంటల్లో సభ్యులందరికీ ముసాయిదా బిల్లు ప్రతులు అందజేయనున్నట్టు మీడియాతో కిరణ్ చెప్పారు. -
ఆ పదవులపై రాజకీయం చేయడం తగదు: బొత్స
విజయనగరం : ఆర్టికల్ 371 డి సహా రాష్ట్ర విభజన అంశం కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసి అయిదు నెలలు కావస్తోందని... పద్ధతి ప్రకారం జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో జాప్యం ఎందుకు జరిగిందో తెలియదని బొత్స అన్నారు. రాజ్యాంగ పరిధిలో పనిచేసే స్పీకర్, గవర్నర్ పదవులకు పవిత్రత ఉందని.... ఆ పదవులపై రాజకీయం చేయటం తగదని బొత్స హితవు పలికారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోలు ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ధర్నా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. -
ఉమ్మడి రాజధానికి ఒప్పుకోం
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఆర్టికల్ 371‘డి’ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకాదని, ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చే యొచ్చని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. విఠల్ అన్నారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకునే ప్రసక్తేలేదని, ఆ పేరుతో జరిగే కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ వాదులకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బాలుర జూనియర్ కళాశాల ఆడిటోరియంలో టి. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్టికర్ 371‘డి’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్టికల్ ఉండాల్సిందేని అన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని, జిల్లాల వారీగా రిక్రూట్మెంట్లు లేకుండాపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. లోకల్ రిజర్వేషన్ల లేకుండాపోయి ఇక్కడి ప్రజలకు తీరనినష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు రాష్ట్రపతి హక్కులు రావాలంటే 371‘డి’ ఆర్టికల్ ఉండాలన్నారు. దేశంలో ఎక్కడాలేని ఉమ్మడి రాజధాని తెలంగాణలో ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కేవలం తాత్కాలిక రాజధానిగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని అంటే మరో పోరాటం చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని, హైదరాబాద్‌పై తెలంగాణ రాష్ట్రానికే సర్వాధికారాలు ఉండాలన్నారు. 13ఏళ్ల శాంతియుత పోరాటం, వెయ్యిమంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడి పాలకులపై ఉందన్నారు. తెలంగాణలో 371 ‘డి’ ఉండాల్సిందే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్ 371 ‘డి’ అడ్డుకాదని హైకోర్టు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి, హైదరాబాద్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. రేపు ఏర్పడబోయే తెలంగాణలో కూడా ఈ ఆర్టికల్ ఉండాల్సిందేనని అన్నా రు. రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడినా ప్రత్యేకరాష్ట్రం ఇవ్వవచ్చన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఇంటర్ విద్య ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చై ర్మన్ మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట య్య, కార్యదర్శి శ్రీనివాస్, కోషాధికారి గోవర్దన్, నాయకులు లక్ష్మారెడ్డి, తిరుపతయ్య, మాధవరావు, సతీష్ పాల్గొన్నారు. -
'వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా తెలంగాణ రాదు'
టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఎర్రబెల్లికి చదువు సంస్కారం లేని వ్యక్తిగా సీఎం రమేష్ అభివర్ణించారు. అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా ఎలా విభజిస్తారని ఆయన ఎర్రబెల్లిని ప్రశ్నించారు. 100 మంది ఎర్రబెల్లిలు వచ్చిన తెలంగాణ రాదని రమేష్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 371 (డి)పైన పార్టీ అనుమతితోనే సుప్రీం కోర్టులో కేసు వేసినట్లు సీఎం రమేష్ వివరించారు. తెలుగుదేశం పార్టీలో వార్డు మెంబర్‌గా విజయం సాధించలేని సీఎం రమేష్‌ను రాజ్యసభ సభ్యులను చేయడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్ పనులను అడ్డుకుంటామని ఎర్రబెల్లి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి వ్యాఖ్యలపై సీఎం రమేష్ పైవిధంగా స్పందించారు.