
మంగళయాన్ స్పీడులో బిల్లు పంపిస్తాం: కిరణ్
హైదరాబాద్: విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 371(డీ) రాజ్యాంగ సవరణ అవసరమని రాష్ట్రపతి ఇచ్చిన నోట్‌లో వుందని మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ప్రతి క్లాజ్‌పైనా శాసనసభలో ఓటింగ్, అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు.
విభజన బిల్లును కేంద్రం జెట్‌స్పీడులో రాష్ట్రానికి బిల్లు పంపితే, మంగళయాన్ స్పీడులో తిరిగి పంపిస్తామని ఆయన చమత్కరించారు. నీటి పంపకాల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. కేంద్రం పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లు ఇంగ్లీషులో ఉందని, దీన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసముందని అభిప్రాయపడ్డారు. మరో రెండు గంటల్లో సభ్యులందరికీ ముసాయిదా బిల్లు ప్రతులు అందజేయనున్నట్టు మీడియాతో కిరణ్ చెప్పారు.