'చివరి బంతి ఎప్పుడో కిరణ్కు బాగా తెలుసు' | kiran kumar reddy knows well about telangana bill, says digvijay singh | Sakshi
Sakshi News home page

'చివరి బంతి ఎప్పుడో కిరణ్కు బాగా తెలుసు'

Published Tue, Dec 24 2013 12:04 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'చివరి బంతి ఎప్పుడో కిరణ్కు బాగా తెలుసు' - Sakshi

'చివరి బంతి ఎప్పుడో కిరణ్కు బాగా తెలుసు'

న్యూఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్రికెటర్‌ కాబట్టి చివరి బంతి ఎప్పుడు అనేది ఆయనకు బాగా తెలుసునని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ముసాయిదా బిల్లు 2014 ఎన్నికల్లోపు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందిని చెప్పారు. తెలంగాణ బిల్లులో లోపాలు నాకు తెలియదని దిగ్విజయ్‌ అన్నారు.

అయితే టీఆర్ఎస్ విలీనానికి, విభజనకు ఎలాంటి సంబంధం లేదని, తాము రాజకీయాలను పరిపాలనతో ముడిపెట్టమని దిగ్విజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ అనేది ప్రజలకిచ్చిన వాగ్దానమని ఆయన అన్నారు. అన్ని రాజకీయపక్షాలు ఆమోదం తర్వాతే తెలంగాణను ప్రకటన చేశామని, విభజనపై తాము వెనక్కి వెళ్లలేమని దిగ్విజయ్ తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement