సీఎం కిరణ్ శైలిపై ఎందుకు చర్య తీసుకోరు: బాలినేని | Congress high command should act on kiran kumar reddy, says Balineni Srinivasa reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ శైలిపై ఎందుకు చర్య తీసుకోరు: బాలినేని

Published Sat, Dec 21 2013 6:40 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ శైలిపై ఎందుకు చర్య తీసుకోరు: బాలినేని - Sakshi

సీఎం కిరణ్ శైలిపై ఎందుకు చర్య తీసుకోరు: బాలినేని

ప్రకాశం:  కాంగ్రెస్ హైకమాండ్‌, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శైలిపై ఎందుకు చర్య తీసుకోదని బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో..  సమైక్య ముసుగులో కాంగ్రెస్, టీడీపీలు మోసం చేస్తున్నాయని బాలినేని  ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అఫిడ్‌విట్‌ ఇవ్వకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తే లాభం ఏంటీ ? అని ఆయన ప్రశ్నించారు.

కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తేనే ఆయన్నుపార్టీ నుంచి బయట పంపిన కాంగ్రెస్ హైకమాండ్‌.. మరీ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శైలిపై ఎందుకు చర్య తీసుకోరని బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement