
'నాలుగేళ్లుగా జగన్ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు'
ఒంగోలు:వైఎస్సార్ సీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని ఆ పార్టీ నేత బాలినే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. నాలుగేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్న జగన్ ప్రజల కోసమే పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం జరిగిందని బాలినేని తెలిపారు.
విశ్వసనీయతకు ప్రజలు పట్టం కడతారని ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ సాధ్యమయ్యేవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.