
ఆ పదవులపై రాజకీయం చేయడం తగదు: బొత్స
విజయనగరం : ఆర్టికల్ 371 డి సహా రాష్ట్ర విభజన అంశం కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసి అయిదు నెలలు కావస్తోందని... పద్ధతి ప్రకారం జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో జాప్యం ఎందుకు జరిగిందో తెలియదని బొత్స అన్నారు. రాజ్యాంగ పరిధిలో పనిచేసే స్పీకర్, గవర్నర్ పదవులకు పవిత్రత ఉందని.... ఆ పదవులపై రాజకీయం చేయటం తగదని బొత్స హితవు పలికారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోలు ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ధర్నా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.