ఆర్టీఏలో స్మార్ట్ కార్డుల కొరత
పలుచోట్ల నిలిచిపోయిన పంపిణీ
వినియోగదారుల పడిగాపులు
సాక్షి, సిటీబ్యూరో: రోజూ వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లెసైన్స్‌లు అందజేసే రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ఆర్టీఏ కేంద్రాల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షలకు హాజరైన వాళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి సకాలంలో స్మార్టు కార్డులు లభించట్లేదు.
సాధారణంగా పరీక్షలు ముగిసిన వారంలోపు విని యోగదారుల ఇంటికి చేరేలా వీటిని పంపిణీ చేస్తారు. కానీ వారం, పది రోజులుగా డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్ల వివరాలను ముద్రిం చి వినియోగదారులకు అందజేసేం దుకు కార్డులు లేకపోవడంతో చాలాచోట్ల ప్రక్రియ నిలిచిపోయింది. డి మాండ్ మేరకు రవాణాశాఖ ఎప్పటికప్పుడు కొత్తకార్డులను రాష్ట్ర టెక్నికల్ సర్వీసుల విభాగం నుంచి తెప్పిస్తుం ది. ఇందుకోసం ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. కొద్ది రోజులుగా అధికారు లు ఈ విషయాన్ని మరిచారు. దాం తో పలు ఆర్టీఏ కార్యాలయాల్లో కార్డుల ప్రింటింగ్, పంపిణీ నిలిచిపోయాయి.
వేలల్లో డిమాండ్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పది ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో రోజూ 5 వేల మంది వాహనదారులు డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహన చిరునామా బదిలీలు, వాహన యాజమాన్య బదిలీలు, డ్రైవింగ్ లెసైన్స్‌ల పునరుద్ధరణ వంటి సేవలు పొందుతారు.
ఒక్కో కార్యాలయంలో రోజుకు 500 కార్డుల చొప్పున ప్రింట్చేసి వాహనదారులకు పంపిణీ చేస్తారు. కొంతకాలంగా కార్డుల పంపిణీ పోస్టల్ ద్వారా జరుగుతుంది. వాహనదారులు పౌరసేవల కోసం హాజరైన రోజు నుంచి వారంలోపు నేరుగా వారి ఇళ్లకు చేరేలా ఈ ప్రక్రియన కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కసారిగా కార్డుల ప్రింటింగ్, పంపిణీ నిలిచిపోవడంతో పలు కార్యాలయాల్లో వేల సంఖ్యలో కార్డుల ముద్రణ పెండింగ్‌లో పడింది. దీంతో సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన పని వారం, పది రోజులుగా నిలిచిపోవడం వల్ల కొత్త కార్డులు వచ్చినా ఒకేసారి ముద్రించి పంపిణీ చేయడం అసాధ్యం. ఉద్యోగులపై పని భారం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం పరీక్షలకు హాజరై, ఉత్తీర్ణులైనట్లుగా గుర్తింపును పొందినప్పటికీ కార్డులు అందకపోవడం వల్ల వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానాలు చెల్లించుకోవలసి వస్తోంది.