arts colleage
-
నేను విన్నాను.. నేను ఉన్నాను...
సాక్షి, రాజమహేంద్రవరం: తమ ప్రియతమ నేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కష్టం చెప్పుకుంటే పరిష్కారమవుతుందని వారంతా భావించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో పింఛన్ వారోత్సవాలకు వచ్చిన సీఎంకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలను విన్న జగన్ వెంటనే స్పందించారు. కలెక్టర్ మాధవీలతను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. కాన్వాయ్ ఆపించి కిందకు దిగి మరీ సమస్యను విన్నారు. తక్షణమే న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎంకు ఇచ్చిన వినతులపై కలెక్టర్ వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చకచకా పరిష్కారం చూపారు. బాధితులకు కలెక్టర్ మాధవీలత శనివారం ప్రభుత్వ సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, చెక్కులను, ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. తమ కష్టం చెప్పగానే సీఎం స్పందించి పరిష్కారం చూపడంతో బాధిత కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి పడుతున్న ఇక్కట్లను సీఎంను కలిసి బాధితుడి తండ్రి వివరించాడు. జగన్ ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష కలెక్టర్ అందజేశారు. ప్రతినెలా రూ.5 వేలు పెన్షన్ అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగనన్నను కలిసినప్పుడు మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పడంతో కలెక్టర్ రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు. – గులిన శ్రీ సాయి గణేష్ తండ్రి, లాలాచెరువు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.. నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి స్పైనల్ మసు్క్యలర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక కష్టం గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఆయన ఆదేశాల మేరకు బాలిక తల్లి సూర్యకుమారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సూర్యకుమారికి నిడదవోలు పీహెచ్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం, పాపకి ప్రత్యేక కేటగిరీ కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం మంజూరు చేశారు. మా అమ్మాయి శాంతి వైద్య సహాయం కోసం సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత తొందరగా ఆ హామీ నేరవేరుస్తారనుకోలేదు. మా కుటుంబ జీవనానికి భరోసా ఇచ్చేలా ఉద్యోగం కూడా ఇచ్చారు. నిడదవోలు మండలంలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సీఎం జగనన్న చల్లగా ఉండాలి. – సి. సూర్యకుమారి, బాధితురాలి తల్లి, నిడదవోలు పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గా సురేష్‌కు ఉన్న చిరుద్యోగం కూడా ఇటీవల పోయింది. ఆయన సీఎం జగన్ దృష్టికి తన సమస్య నివేదించారు. సీఎం ఆదేశాల మేరకు దుర్గా సురేష్‌కు ఆర్ఎంసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తూ పునర్ నియామక ఉత్తర్వులు కలెక్టర్ అందచేశారు. పాప ఆరోగ్యం కోసం రూ.లక్ష ఆర్థిక సహాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చాలామంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కలుగలేదు. సీఎం జగనన్నను కలిశాను. ఆయన వెంటనే స్పందించి కలెక్టరమ్మకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంటనే మనసు పెట్టి మా సమస్యలు పరిష్కరించారు. జగనన్న ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. – సిరికొండ దుర్గా సురేష్, రాజమహేంద్రవరం జగనన్న మాటతోఉద్యోగం వచ్చింది... రాజానగరం నామవరానికి చెందిన కాశాని దుర్గా శ్రీదేవి భర్త గతేడాది మార్చిలో మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదువులు చదివించేందుకు ఆర్థిక భరోసా కల్పించాలని దుర్గా శ్రీదేవి సీఎం జగన్‌ను కలిసి కోరింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కడియం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగమిస్తూ నియామక ఉత్తర్వులను కలెక్టర్ శనివారం అందజేెశారు. 3వ తేదీన ముఖ్యమంత్రి జగనన్నను కలిసే అదృష్టం వచ్చింది.నాకు కష్టాలను చెప్పాను. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగనన్న స్పందించారు. ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. – కాశాని దుర్గా శ్రీదేవి, నామవరం జగనన్న మనసున్న మారాజు... రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన క్రిస్టఫర్ 25 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి ఇటీవల కలిశారు. సీఎం తెలుసుకుని న్యాయం చేయాలని ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీలో ప్లాట్ నంబర్ 53లో 77 చదరపు గజాల స్థలానికి చెందిన పట్టాను కలెక్టర్ మాధవీలత అందచేశారు. ఒంటరిగా ఉంటున్న నాకు గతంలో ఎవరూ ఇంటి స్థలం ఇవ్వలేదు. జగనన్నను కలిసి కష్టం చెప్పుకున్నాను. ఆయన అంతా విన్నారు. ఇంటి స్థలమిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే నాకు ఇంటి స్థలం వస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రి‡ జగనన్నకు ధన్యవాదాలు. – కె. క్రిస్టఫర్, రాజమహేంద్రవరం (చదవండి: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు) -
విశ్వహోదాపై నీలినీడలు
ఆర్ట్స్ కళాశాలకు వర్సిటీ స్థాయిపై గందరగోళం పెద్ద సంఖ్యలో అధ్యాపకుల బదిలీలు మోకాలడ్డుతున్న ఉన్నత విద్యాశాఖ విడుదల కాని యూజీసీ నిధులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : అనుకున్నట్టుగా అంతా జరిగి ఉండి ఉంటే.. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల(అటానమస్)కు ఈపాటికే విశ్వ విద్యాలయం హోదా దక్కి ఉండేది. కానీ, ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యం పుణ్యమా అని ఈ చారిత్రక కళాశాలకు ‘విశ్వ’హోదా దక్కే ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. 1853లో జిల్లా స్కూలుగా ఈ విద్యాలయ ప్రస్తానం మొదలైంది. తదనంతరం నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రొవిన్షియల్ స్కూలుగా.. ప్రభుత్వ కళాశాలగా రూపుదాల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వ కళాశాలగా పేరొందింది. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగంపంతులుగారు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావులు ఈ కళాశాలలో విద్యాబోధన చేశారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు, మాజీ కేంద్ర మంత్రి వీకే కృష్ణమీనన్, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావువంటివారు ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసినవారే. ఇంతటి ఖ్యాతినొందిన ఈ కళాశాలకు విశ్వవిద్యాలయం హోదా దక్కే అవకాశం కొద్ది నెలల కిందట వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా)కు పంపారు. దానికి దాదాపు ఆమోదం లభించింది. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో వేరే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకేసారి 30 మంది అధ్యాపకుల బదిలీ ఆర్ట్స్ కళాశాలలో మొత్తం 23 అండర్ గ్రాడ్యుయేట్, ఏడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులున్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. కళాశాలకు మొత్తం 150 అధ్యాపక పోస్టులు అవసరం కాగా, కొన్నాళ్ల కిందటి వరకూ 83 మంది అ«ధ్యాపకులు, పీహెచ్‌డీలతో నెట్టుకొచ్చేవారు. అసలే చాలీచాలని అధ్యాపకులతో ఇబ్బందులు పడుతూండగా.. కొద్ది రోజుల కిందట ఒకేసారి 30 మంది అధ్యాపకులను, పీహెచ్‌డీలను బదిలీ చేశారు. దీంతో వారి సంఖ్య 53కు పడిపోయింది. బదిలీ అయినవారిలో నలుగురు పీహెచ్‌డీలు, సీనియర్లు ఉన్నారు. కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. త్వరలో వర్సిటీ హోదా వస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఒకేసారి అంతమంది అధ్యాపకులు బదిలీ అవడం చర్చనీయాంశమైంది. అందునా ఈ ఏడాది కళాశాలలో ఎక్కువమంది విద్యార్థులు చేరారు. వారికి పీహెచ్‌డీలు ఒక్కరూ లేరు. పనులు ప్రారంభం కాక.. ఏదైనా కళాశాలకు యూనివర్సిటీ హోదా ఇవ్వాలంటే ముందుగా దానిని కాలేజీ ఫర్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్ (సీపీఈ) ఎంపిక చేయాలి. ఆవిధంగా కూడా ఆర్ట్స్ కళాశాల ఎంపికైంది. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మంజూరయ్యాయి. కానీ, కళాశాలలో వర్సిటీ హోదాకు సంబంధించిన పనులు ఆరంభం కాకపోవడంతో ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. మరోపక్క వర్సిటీ హోదాకు సంబంధించిన పనులు సెక్రటేరియట్లో జరగడంలేదు.ఉన్నత విద్యాశాఖలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నంబర్–1 స్థానంలో ఉంది. అది కాస్తా వర్సిటీగా మారిపోతే తమకో కళాశాల పోతుందన్న ఉద్దేశంతోనే ఉన్నత విద్యాశాఖ వర్సిటీ అప్గ్రడేషన్పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. బదిలీకి ప్రిన్సిపాల్ యత్నాలు సరిగ్గా ఇదే సమయంలో తనను బదిలీ చేయాలని ప్రిన్సిపాల్ సీహెచ్ మస్తానయ్య ఉన్నత విద్యాశాఖ అనుమతి కోరారు. యూజీసీ నిబంధనలు, జీవో నంబర్–42 ప్రకారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఐదేళ్లు పని చేయాలి. కానీ మూడేళ్లకే ఆయన వెళ్లిపోవడానికి ప్రయత్నించడం కూడా చర్చనీయాంశమవుతోంది. కమిషనరేట్‌కు వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అక్కడ పని చేసే వేరే వ్యక్తిని ఇక్కడకు ప్రిన్సిపాల్‌గా పంపేలా ఒప్పందం చేసుకున్నారని చెబుతున్నారు. నిలిచిన యూజీసీ గ్రాంట్స్ కళాశాలకు అటానమస్ కింద ఏటా రూ.20 లక్షలు, నాన్ అటానమస్ కింద రూ.కోటి వరకూ నిధులు మంజూరవుతాయి. వీటిని ఏవిధంగా ఖర్చు చేసిందీ చూపాలి. కానీ, ఆవిధంగా జరగకపోవడంతో యూజీసీ నిధులను నిలిపివేయడంతోపాటు నోటీసులు కూడా పంపింది. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ హోదా ఎండమావే కానున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండునెలల్లో కళాశాల నాక్ గ్రేడ్‌కు వెళ్లాల్సి ఉంది. ఇప్పటివరకూ కళాశాల నాక్–ఎ గ్రేడ్‌లో నిలిచింది. అభివృద్ధి కుంటుపడడంతో ఈసారి అది లేనట్టేనని అంటున్నారు. మేం చేయాల్సిదంతా చేశాం ఆర్ట్స్ కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు మేము చేయాల్సిందంతా చేశాం. మొదట్లో యూనివర్సిటీ ప్రకటించారు. తరువాత సీపీఈ ఉంటేనే చేస్తామన్నారు. అదీ ఇచ్చారు. ఇక మా చేతుల్లో ఏమీలేదు. నాక్–ఎ గ్రేడ్‌కు వెళ్తాం. ఇంకా ౖటైమ్ ఉంది కదా. – సీహెచ్ మస్తానయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకుల బదిలీలతో ఆటంకం ఆర్ట్స్ కళాశాల విశ్వవిద్యాలయం హోదా వచ్చేందుకు మార్గం సుగమమైన దశలో ఒకేసారి 30 మంది అధ్యాపకులను బదిలీ చేయడం వెనుక కుట్ర ఉంది. యూనివర్సిటీ హోదాకు అడ్డుకట్ట వేయాలన్నదే దీని ఉద్దేశంలా కనిపిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం. అధికారులు, ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణితోనే యూజీసీ నిధులు ఆగిపోయాయి. – కె.విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు