శంషాబాద్ చేరిన ఉపేంద్ర, అరవింద్ మృతదేహాలు
హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థులు ఉపేంద్ర, అరవింద్ మృతదేహాలు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. నగరంలోని వనస్థలిపురం నివాసి అయిన అరవింద్ మృతదేహాన్ని తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి తరలి వచ్చారు.
ప్రభుత్వం అతడి మృతదేహన్ని వనస్థలిపురం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ఉపేంద్ర మృతదేహన్ని అతడి స్వస్థలం ఖమ్మం జిల్లా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు బియాస్ నది నుంచి 8 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నగరానికి చెందిన విఎన్ఆర్ విజ్ఞన జ్యోతికి చెందిన విద్యార్థులు విజ్ఞన యాత్ర కోసం ఉత్తర భారతంలో పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో గత ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఫోటో దిగుతున్నారు. అయితే అదే సమయంలో లార్జీ డ్యామ్ నుంచి నీరు విడుదల చేయడంతో ఆ నీటీ ప్రవాహానికి విద్యార్థులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.