క్వార్టర్స్‌లో రష్మిక, శివాని
షాజిహా కూడా...
ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని, షాజిహా బేగం సత్తాచాటారు. వీరంతా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. నగర శివారులోని లియోనియా రిసార్ట్స్ ఇండోర్ టెన్నిస్ కోర్టుల్లో మంగళవారం ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. అండర్-14 బాలికల సింగిల్స్‌లో ఆరో సీడ్ శ్రీవల్లి 6-2, 6-4తో రచనపై, నాలుగో సీడ్ శివాని 6-7 (3/7), 6-3, 7-5తో తహూర షేక్‌పై, షాజిహా 6-1, 3-6, 6-3తో శరణ్య గవరేపై విజయం సాధించారు. మూడో సీడ్ సాయిదేదీప్య 6-0, 6-1తో స్మృతి బాసిన్‌పై, షేక్ హుమేరా 6-2, 0-6, 6-1తో పాన్య భల్లాపై, రెండో సీడ్ మహక్ జైన్ 6-2, 6-1తో నేహ ఘరేపై గెలుపొందారు.
అండర్-14 బాలుర సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు శ్రీవత్స క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సంపాదించాడు. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ శ్రీవత్స రాతకొండ 7-6 (7/5), 6-3తో రోహన్ కె. రెడ్డిపై, కుశాల్ 6-3, 6-3తో సాయి కార్తీక్‌పై, నాలుగో సీడ్ రిత్విక్ 6-2, 6-4తో అమన్ అయూబ్ ఖాన్‌పై, నీల్ గరుద్ 6-3, 6-3తో ఓంకార్ ఆప్టేపై, తీర్థ శశాంక్ 6-1, 6-0తో వల్లభ్‌పై, ప్రలోక్ ఇక్కుర్తి 6-1, 6-2తో రాహుల్ జైదీప్‌పై, హిమాన్షు మోరె 6-2, 7-5తో విపుల్ మెహతాపై విజయం సాధించారు.