ఎమ్మెల్యే ఎస్వీ, ఫరూక్‌లకు షాక్
– వైఎస్సార్సీపీకే ఓటు వేస్తామన్న టీడీపీ కౌన్సిలర్ కొడుకు
నంద్యాల : కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లకు కౌన్సిలర్ భీమునిపల్లె వెంకటసుబ్బయ్య కుమారుడు పురుషోత్తం షాక్ ఇచ్చారు. ఆశీర్వాద యాత్రలో భాగంగా వీరిద్దరూ ఇటీవల వెంకటసుబ్బయ్య ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో కౌన్సిలర్లలో జరిగిన గొడవలో తండ్రి వెంకటసుబ్బయ్య గాయపడినా ఏ నాయకుడు తమను పరామర్శించడానికి రాలేదని, ఉప ఎన్నికల కోసం వస్తే ఎలా మద్దతు ఇస్తామని పురుషోత్తం ప్రశ్నించారు. ఆరునూరైనా వైఎస్సార్సీపీకే ఓటు వేస్తామని చెప్పడంతో ఫరూక్, ఎస్పీమోహన్‌రెడ్డి నిరాశతో వెనుదిరిగారు.