అశోక్బాబు ప్యానల్ ఏకగ్రీవ ఎన్నిక!
గాంధీనగర్ (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో పి.అశోక్బాబు ప్యానల్ విజయం ఖాయమైంది. అధ్యక్ష స్థానానికి అశోక్బాబు ఆదివారం ఎన్నికల అధికారి డి.దాలినాయుడుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
అయితే ఇప్పటి వరకు అశోక్బాబు ప్యానల్ మాత్రమే నామినేషన్ వేసింది. దీంతో ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. నామినేషన్ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు ఎ.విద్యాసాగర్, ఇక్బాల్, కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు.