Ashok Choudhary
-
కాంగ్రెస్‌కు బిహార్ నేత ఝలక్
సాక్షి, పట్నా: బీహార్ కాంగ్రెస్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నమొన్నటివరకూ బిహార్ పీసీసీగా వ్యహరించిన అశోక్ చౌదరిను ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో అశోక్ చౌదరి అనూహ్యంగా ప్రధానిని కలిసి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. పట్నా యూనివర్సిటీ శత వసంతాల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బిహార్ మాజీ పీసీసీ చీఫ్ అశోక్ చౌదరి పాల్గొనడంతో పాటు.. మోదీ, నితీష్ కుమార్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. అనంతరం సీఎం నితీష్ మాట్లాడుతూ.. ఈ ఘటనతో ఆశోక్‌ను కాంగ్రెస్ పార్టీ వెంటనే సస్పెండ్ చేస్తుందేమో అని చమత్కరించారు. పార్టీని చీల్చేందుకు అశోక్ చౌదరి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో కాంగ్రెస్ అతన్ని పార్టీ చీఫ్ పదవి నుంచి గత నెల్లో తప్పించింది. అప్పటినుంచి అవకాశం చిక్కిన ప్రతిసారీ.. అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీ అధినాయత్వం మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తత్సబంధాలున్న అశోక్ చౌదరి.. జేడీయూలో చేరుతారనే ఊహాగానాలు కొంతకాలంగా ఉన్నాయి. -
పార్టీ చీఫ్ పదవి పోయింది.. ఒక జంపేనా..!
న్యూఢిల్లీ : బిహార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ చౌదరీపై వేటు పడింది. అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా నేరుగా పార్టీని అశోక్ చౌదరీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చాలా సన్నిహితంగా ఉండే అశోక్ చౌదరీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో బిహార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఆ భేటీకి అశోక్ చౌదరీని ఆహ్వానించలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా అవసరమైతే తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చీలిక తెస్తానని కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ విషయంపై భేటీ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తొలగిస్తే జరగబోవు పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన కోరుకున్నట్లుగానే అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఢిల్లీలో ఓ ప్రకటనల చేశారు. కాగా, చౌదరీ స్పందిస్తూ 'పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి పనిచేశాను. ఇది పార్టీ నిర్ణయం నేను దానిని గౌరవిస్తాను' అని చౌదరీ చెప్పారు. చౌదరీకి మద్దతుగా 18మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏ క్షణంలోనైనా కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చే అవకాశం ఉంది. -
'నేను చాలా హర్ట్ అయ్యాను'
పట్నా : బిహార్ కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్త చర్చ ఊపందుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ను ఆహ్వానించకుండానే ఓ పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకొని బిహార్ రాజకీయాలపై రాహుల్‌గాంధీ చర్చపెట్టడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గురువారం ఢిల్లీలో బిహార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశానికి బిహార్ కాంగ్రెస్ చీఫ్ అయిన అశోక్ చౌదరిని పిలవకుండా పక్కకు పెట్టారు. దీనిపై ఓ మీడియా సంస్థ చౌదరీని ప్రశ్నించగా 'నన్ను ఎందుకు పక్కకు పెట్టారో నాక్కూడా స్పష్టంగా తెలియదు. ఈ విషయం నన్ను చాలా బాధించింది' అని చెప్పారు. ఆయన స్పందన ప్రకారం బిహార్ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడేందుకు మరింత అవకాశం ఏర్పడినట్లు కనిపిస్తోంది. బహుషా, ఏదైనా కారణం వల్ల అశోక్ కుమార్‌ను పిలవకపోయి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పదిమందిని పిలిపించుకొని రాహుల్ వారితో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా బిహార్ కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్ కుమార్‌ను కొనసాగించాలా తొలగించాలా అనే విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, అదే జరిగితే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనను తొలగిస్తే దాదాపు 18 నుంచి 27మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న అశోక్ కుమార్ పార్టీని చీల్చే అవకాశం లేకపోలేదు.