మధుకోడాపై ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ప్రత్యేక కోర్టులో సీబీఐ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మోసం, కుట్రలకు పాల్పడ్డారంటూ మధు కోడాపై అభియోగాలను సీబీఐ నమోదు చేసింది. అలాగే జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసుతోపాటు మరో అరుగురిపై కూడా సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
మధుకోడా జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోడా ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టంది. అందులోభాగంగా 144 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్లో జప్తు చేసిన సంగతి తెలిసిందే.