కొంపముంచిన డ్రైవర్ నిద్రమత్తు
బేస్తవారిపేట :వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుల్లో ఒకరి భార్య తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండలంలోని పెంచికలపాడు బస్టాండ్ సమీపాన ఒంగోలు నంద్యాల హైవే రోడ్డుపై బుధవారం జరిగింది. వివరాలు.. నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన తాళ్ల శ్రీనివాస్(55) పక్షవాతం తో బాధపడుతున్నాడు. కర్నూలు జిల్లా గుండుపాపలలో పసురు మందు తాగేం దుకు తన భార్య రమణమ్మతో కలిసి ఇండికా కారులో బయల్దేరాడు. డ్రైవర్ శిరికొండ అశోక్(40) నిద్ర మత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టిం ది.
కారు నుజ్జునుజ్జు కావడంతో అందు లో దంపతులతో పాటు డ్రైవర్ కూరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. పెంచికలపాడు గ్రామస్తులు సంఘటన స్థలాని కి వచ్చి కారులో ఇరుక్కుపోయిన ముగ్గురిని అతికష్టం మీద బయటకు తీసి 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. చికిత్స అందించేలోపు తీవ్రంగా గాయపడిన అశోక్ మృతిచెం దాడు. గంట తర్వాత పక్షవాతంతో బాధపడుతున్న శ్రీనివాస్ కూడా ప్రాణా లు విడిచాడు. ఆయన భార్య రమణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.