మాజీ ప్రొఫెసర్‌పై కేసు నమోదు
ఉదయ్‌పూర్: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్ అశోక్ వోహ్రాపై రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. మోహన్ లాల్ శుక్లా యూనివర్సిటీలో 'రెలిజియస్ డైలాగ్' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో వోహ్రా మాట్లాడుతూ హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏబీవీపీ కార్యకర్త దేవేంద్రసింగ్ ఫిర్యాదు మేరకు ఓ మతాన్ని కించపరిచినందుకు సెక్షన్ 295, ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే చర్యకు పాల్పడినందుకు సెక్షన్ 153(ఎ) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వోహ్రా.. 'ఈ వ్వాఖ్యలు నావి కావు. నేను కేవలం విదేశీ రచయితల అభిప్రాయాలను మాత్రమే వెల్లడించాను. నా ప్రసంగానికి సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఓ ప్యానల్‌ను నియమించాల్సిందిగా కోరుతున్నాను' అని ముఖ్యమంత్రి వసుంధర రాజేకు లేఖ రాశారు.