assemly
-
చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా ఇతర ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. బీజేపీ గత బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 2018 మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను 'కివిమెలెహూవ'గా అభివర్ణించారు. అంటే ప్రజలను ఫూల్స్ చేస్తోందని అర్థం. Congress MLAs in Karnataka attended budget session with flower on their ears as a mark of protest. They call it Kivi mele hoova protest. pic.twitter.com/Kx5kdIrbrQ — Nagarjun Dwarakanath (@nagarjund) February 17, 2023 సీఎం బొమ్మై ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఆరోపించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వెనక్కితగ్గకుండా నిరసనలు కొనసాగించారు. సీఎం మాత్రం యథావిధిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. రామనగరలో రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తరచూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలం పార్టీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇస్తే వాటిలో 10 శాతం మాత్రమే అమలు చేసిందని ధ్వజమెత్తారు. చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్ -
త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాలకు సంబంధించి భూయజమానులకు త్వరలోనే క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సభ్యుల సందేహాలను నివృత్తి చేసే క్రమంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో భూ వివాదాలకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సాదాబైనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ విక్రయ లావాదేవీలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్నవారి వివరాలు రికార్డుల్లోకెక్కలేదని, యజమానులైనప్పటికీ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో వివాదాలకు అవకాశం కలుగుతోందన్నారు. ఇలాంటి వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా తొలుత 15.68 లక్షల దరఖాస్తులు వచ్చా యని, వీటిల్లో 6.18 లక్షలను క్లియర్ చేసినట్లు వెల్లడిం చారు. ఆ తర్వాత 2 దఫాలు గా అవకాశం ఇవ్వగా మరో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి కోర్డులో కేసు దాఖలు కావటంతో క్రమబద్ధీకరణ పెండింగ్‌లో పడిందన్నారు. కోర్టు కేసు క్లియర్ కాగానే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని సభకు వివరించారు. భూ రిజిస్ట్రేషన్‌లో ఎవరి జోక్యం లేకుండా, అంతా ఆన్లైన్ విధానంతో జరిగేలా రూపొందించిన ధరణి పోర్టల్ రైతులకు పెద్ద వరంలాంటిదన్నారు. ధరణి వ్యవహారం ఓ చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతం.. రాష్ట్రంలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టే మూడు ప్రధాన శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. కేవలం 1,300 సిబ్బందితో ఈ శాఖ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సజావుగా సాగేందుకు వీలుగా నిధులను సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కోవిడ్‌తో గత ఆర్థిక సంవత్సరం ఇబ్బంది ఉండగా, అంతకుముందు యేడు 1,300 మంది సిబ్బంది, 141 కార్యాలయాల ద్వారా 15.34 లక్షల భూలావాదేవీలతో రూ.6,620 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిం దన్నారు. త్వరలో రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించనున్నామని, పార్ట్–బీలో ఉన్న వివాదాలను మొదటి దశలోనే పరిష్కరిస్తామని, ఇందుకు బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. -
ఐఏఎస్ మృతిపై అట్టుడికిన సభ
► అనురాగ్ తివారి వ్యవహారంపై చర్చకు బీజేపీ పట్టు ► విధానసభలో ఇరుపక్షాల వాగ్వాదం సాక్షి, బెంగళూరు: కర్ణాటక క్యాడర్ యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అనుమానాస్పద మరణం గురువారం విధానసభలో ప్రతిధ్వనించింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ ఆరంభమైన వెంటనే విపక్షాల ఒత్తిడి మేరకు స్పీకర్ కోళివాడ స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వగా, బీజేపీ పక్ష నేత జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా ఉత్తమ సేవలు అందించిన అనురాగ్ తివారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై చట్టసభల్లో చర్చించాల్సిన అవసరం ఉంది.’ అని డిమాండ్ చేశారు. స్పీకర్ కోళివాడ స్పందిస్తూ ఈ కేసును ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తుండటం వల్ల చట్టసభలో చర్చించడానికి అవకాశం లేదన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శెట్టర్ గతంలో సీబీఐకు అప్పగించిన పలు కేసులను ఇదే సభలో చర్చించామన్నారు. న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మాట్లాడుతూ బీజేపీ నాయకులు చావును కూడా రాజకీయం చేస్తున్నారని ఘాటు వాఖ్యలు చేశారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించి చట్టసభలో చర్చించడం వల్ల ప్రయోజం ఏమీ ఉండబోదన్నారు. అనురాగ్ తివారి అనుమానాస్పద విషయం పై చర్చకు అనుమతివ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టారు. ఇందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో విపక్ష బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి ధర్నాకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఒత్తిడికి తలొగ్గిన స్పీకర్ కోడివాళ ఈ విషయమై విషయాన్ని ప్రస్తావించడానికి మాత్రం అవకాశం కల్పించారు. జగదీ శెట్టర్ మాట్లాడుతూ...‘బాధిత కుటుంబ సభల్యులు ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు. వారిని కనీసం ప్రభుత్వం అధికారికంగా మాట్లాడి వారికి సాంత్వన చేకూర్చాలి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరికాదు. అది మానవత్వం అనిపించుకోదు.’ అని పేర్కొన్నారు. చివరకు స్పీకర్ సూచనతో చర్చను ముగించారు. -
''మాకు మాట్లాడ్డానికి టైం ఇవ్వడం లేదు''
-
'కిరణ్ వేసిన తొలిబంతి తెలంగాణాకు అనుకూలంగానే ఉంది'