Assets of MLAs
-
98 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణ
న్యూఢిల్లీ: ఏడుగురు లోక్సభ సభ్యులు, 98 మంది ఎమ్మెల్యేల ఆస్తుల్లో గణనీయమైన పెరుగుదలను గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సీబీడీటీ ఆధ్వర్యంలోని ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు నిర్వహించింది. ఆ వివరాల్ని వెల్లడిస్తూ సోమవారం కోర్టుకు సీబీడీటీ పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించింది. ‘లోక్ ప్రహరి ఎన్జీవో సంస్థ ఇచ్చిన ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్ వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారించింది. ప్రజాప్రతినిధుల ఆస్తులు భారీగా పెరిగినట్లు ఆ విచారణలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి’ అని పేర్కొంది. ఈ అంశంపై మరింత లోతుగా విచారించి.. ఆ సభ్యుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు సమర్పిస్తామని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖనివేదిక వివరాల్ని ఆర్టీఐ చట్టం కింద అందించలేమని అఫిడవిట్లో బోర్డు వెల్లడించింది. లక్నోలోని ఎన్జీఓ సంస్థ ‘లోక్ ప్రహరి’ ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంను ఆశ్రయించింది. ఆ సంస్థ సుప్రీంకు 26మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 257 మంది శాససనసభ్యుల ఆస్తుల వివరాలను అందించింది. -
భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు!
ముంబై:మహారాష్ట్రలో శాసన సభ్యుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో వెల్లడయ్యింది. 216 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 164 శాతం మేర పెరిగినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. సగటున ఎమ్మెల్యే ఆస్తి రూ. 4.97 కోట్ల నుంచి రూ.13. 15 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఎమ్మెల్యేలంతా 2009 లో గెలిచి తిరిగి మరలా బరిలోకి దిగేందుకు సన్నద్ధమైనట్లు పేర్కొంది. బుధవార మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో హర్యానా, మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా పోటాపోటీ ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు చివరి రోజున సాధ్యమైనంత విస్తృతంగా సభలు నిర్వహించాయి. మహారాష్ర్టలోని 288 సీట్లు, హర్యానా అసెంబ్లీలోని 90 సీట్లకు బుధవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.