భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు! | Assets of 216 MLAs grew 164 pc since last Maha polls | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు!

Published Tue, Oct 14 2014 6:19 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు! - Sakshi

భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు!

ముంబై:మహారాష్ట్రలో శాసన సభ్యుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో వెల్లడయ్యింది. 216 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 164 శాతం మేర పెరిగినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. సగటున ఎమ్మెల్యే ఆస్తి రూ. 4.97 కోట్ల నుంచి రూ.13. 15 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఎమ్మెల్యేలంతా 2009 లో గెలిచి తిరిగి మరలా బరిలోకి దిగేందుకు సన్నద్ధమైనట్లు పేర్కొంది.

 

బుధవార మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.  దీంతో హర్యానా, మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా పోటాపోటీ ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు చివరి రోజున సాధ్యమైనంత విస్తృతంగా సభలు నిర్వహించాయి. మహారాష్ర్టలోని 288 సీట్లు, హర్యానా అసెంబ్లీలోని 90 సీట్లకు బుధవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement