Associate Professors
-
దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్య వృత్తిలో విద్యార్థినులకు నైపుణ్యాలను నేర్పాల్సిన వైద్యులు కీచకులుగా మారుతున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ఒక విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టగా అనేక అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. పది మందికిపైగా విద్యార్థినులు, మహిళా సిబ్బంది తమను కూడా లైంగికంగా వేధించారంటూ ఇద్దరు వైద్యులపై విచారణ కమిటీ ఎదుట పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మరింత లోతుగా విచారణ జరిపేందుకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగిందంటే... ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతున్న ఒక విద్యార్థినిని కొంత కాలంగా ఓ అసోసియేట్ ప్రొఫెసర్ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయం ఆమె స్నేహితుల ద్వారా తండ్రి, సోదరుడికి తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, తాను విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కళాశాలలోని ఉమెన్ గ్రీవెన్స్ సెల్ సభ్యులను విచారణ చేపట్టాలని ఆదేశించారు. మరిన్ని అరాచకాలు.. దంత వైద్య కళాశాలలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ సభ్యులు విద్యార్థినులను, మహిళా ఉద్యోగినులను పిలిచి విచారిస్తున్నారు. ఈ విచారణలో పది మందికిపైగా తమను ఇద్దరు వైద్యులు లైంగికంగా వేధించినట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మిగిలిన వారంతా మౌఖికంగా చెప్పినప్పటికీ, రాత పూర్వకంగా రాసేందుకు భయపడుతున్నట్లు సమాచారం. గతంలోనూ ఆరోపణలు.. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒక విద్యార్థినిని వేధింపులకు గురిచేయగా, ఒక మహిళా ప్రొఫెసర్ అతనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ నాటి ప్రిన్సిపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడంతో అప్పట్లో ఏ చర్యలు తీసుకోకుండానే మాఫీ చేశారు. విచారణ చేస్తున్నాం.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కళాశాల ఉమెన్ గ్రీవె న్స్ సెల్ సభ్యులు విచారణ చేస్తు న్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యునితో పా టు, మరొకరు కూడా వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి డీఎంఈకి నివేదిస్తాం. – డాక్టర్ యుగంధర్, ప్రిన్సిపాల్,ప్రభుత్వ దంత వైద్య కళాశాల చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ(ఐఐఐటీ).. అసిస్టెంట్/అసోసియేట్ ప్రొఫెసర్లు (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (మ్యాథమేటిక్స్/డేటాఅనలిటిక్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, స్పెషలైజేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామాకు పంపించాలి. ► ఈమెయిల్: careers.faculty@iiits.in ► దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021 ► వెబ్సైట్: http://www.iiits.ac.in మరిన్ని నోటిఫికేషన్లు ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు -
రూబీ సరే.. ఈ ప్రొఫెసర్లు మాములోళ్లేం కాదు!
ఆగ్రా: చదువులు చట్టుబండలయ్యాయా.. చదువుతున్నవారు.. చదువుకున్నవారు చట్టుబండలుగా మారుతున్నారా.. అనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు బిహార్, అటు ఉత్తరప్రదేశ్‌లోని పరిస్థితి చూస్తుంటే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులే కాదు.. పాఠాలు బోధించే పంతుల్లు అందులోనూ ఏకంగా ప్రొఫెసర్లు కూడా చట్టుబండలవుతున్నారు. బిహార్ లో తప్పుడు మార్గంలో టాపర్ గా వచ్చి ప్రస్తుతం జైలులో ఉన్న రూబీ రాయ్ పరిస్థితి ఎలా ఉన్నా ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రొఫెసర్ల పరిస్థితి చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. పొలిటికల్ సైన్స్ అనే పదానికి అర్థం తెలియక పోయినా అక్రమ మార్గంలో బిహార్ టాపర్‌గా వచ్చి చివరకు అసలు విషయం బయటపడి ప్రస్తుతం రూబీ రాయి అనే విద్యార్థిని జైలులో ఉండగా.. ఆడిట్ అంటే అర్థం తెలియని ఓ అర్థశాస్త్ర ప్రొఫెసర్ దర్జాగా కాలర్ ఎగరేసుకొని బయట తిరుగుతున్నాడు. అవును ఇది నిజమే.. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంగ్లిష్ ప్రొఫెసర్, ఎకనామిక్స్ ప్రొఫెసర్లు చిన్నచిన్నపదాలకు కూడా అర్థం చెప్పకుండా ఆ రాష్ట్రంలో దిగజారిపోయిన విద్యావ్యవస్థను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆంగ్ల ప్రొపెసరేమో ఎవల్యూషన్ అనే పదానికి స్పెల్లింగ్ చెప్పడం రాక తికమకపడగా.. ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆడిట్ అనే పదానికి అర్థం చెప్పలేక.. ఐఎంఎస్(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్-అంతర్జాతీయ ద్రవ్య నిధి) పదానికి సాంకేతిక పదానికి ఒక కొత్త నిర్వచనం సృష్టించారు. ఐఎంఎప్ అంటే ఇంటర్నేషనల్ మనీ ఫౌండ్ అంటూ కొత్త భాష్యం చెప్పారు. దీంతో అవాక్కవడం ప్రశ్నలు అడిగినవారి వంతైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్ మెంట్ కు సంబంధిచి బీఏ ఆంగ్లము, ఎకనామిక్స్ పేపర్లను దిద్దే సమయంలో వారికున్న ఈ గొప్పపరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు వేసిన మార్కులను చూసిన కో ఆర్డినేటర్ కు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా ఈ విషయం రట్టయింది. కాగా, ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ను, వర్సిటీ చాన్స్‌లర్ ను సంప్రదించగా ఆ టీచర్ల వివరాలు మెయిల్ చేయమన్నారట. శ్యాం బహదూర్ అనే వ్యక్తి ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్ గా మహాత్మా జ్యోతిభా పులే రోహిల్‌ఖండ్ యూనివర్సిటీలో పనిచేస్తుండగా.. అనిల్ కుమార్ పాల్ అనే ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గా వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. -
మౌనం వెనుక మర్మమేమిటో..!
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 128మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు కళాశాలకు వచ్చిన వీరిలో చాలామంది ఆ తరువాత మొహం చాటేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు వచ్చిన రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఏడాది కాలంగా వైద్యవిద్య బోధన, రోగులకు వైద్యసేవలు అందించడానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు రావడం లేదు. వాస్తవానికి ఇక్కడికి కేటాయించిన ప్రొఫెసర్లందరూ కళాశాలలోనే తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండాలి. అందుకు అనుగుణంగానే వారి కోసం అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులో సకాల సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. కానీ ఉండే వారు లేక అవి బోసిపోతున్నాయి. చాలామంది వైద్యులు జిల్లాకే రావడం లేదు. హైదరాబాద్‌కు చెందిన 32మంది ప్రొఫెసర్లు అక్కడే ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీసుల్లో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లను ఇక్కడికి కేటాయించగా వీరు రెండుసార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసర్‌ను ఇక్కడికి కేటాయించారు. ఆయన వైద్యవిద్యలో భాగమైన పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రసిద్ధి. ఈ సేవలను అందించేందుకు ఇక్కడికి కేటాయించగా ఇప్పటి వరకు ఆయన కళాశాల వైపు చూడలేదు. నలుగురు స్త్రీ వైద్యనిపుణులు ఇక్కడికి కేటాయించగా, వీరు రెండు నెలల పాటు వైద్యసేవలు అందించి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. ప్రస్తు తం ఆస్పత్రిలో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉం డాల్సింది, కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా ఉదయం ఒక గంట మాత్రమే ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల మౌనం మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చ ర్యలు తీసుకోవడంలో కళాశాల అధికారులు స్పందిం చడం లేదు. గతంలో వీరిపై చర్య తీసుకుంటే ఉన్నఫలంగా వెళ్లిపోతారని, దీంతో కళాశాలకు అనుమతికి ఇబ్బందులు వస్తాయని భావించారు. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి అనుమతి లభించింది. అయినా ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. విధులకు రాకుండా రిజిష్టరులో సంతకాలు లేకుండానే ప్రతి నెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఆయన వీరిపై కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవడం లేదు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై గత మార్చిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సుబ్రమణ్యం నివేదిక అందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కళాశాల అధికారులు సాహసించలేదు. ఇటీవల కొంతమంది ప్రొఫెసర్లు తమ యూనియన్ నాయకులను తీసుకవచ్చి ఎవరూ ఏమనకూడదన్నట్లుగా వైద్యాధికారులపై చిందులు వేయించారు. అప్పటి నుంచి ప్రొఫెసర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా త యారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన పెద్దాస్పత్రి, వైద్యకళాశాలలు సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.