ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విచారణ జరపాలి: లాలు
పట్నా: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆదివారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బంధవ్గర్, అతర్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది చాల ముఖ్యమైన విషయమని, ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై వెంటనే విచారణ చెపట్టాలన్నారు.
ఈవీఎంల పేపర్ ఆడిట్ ట్రయల్‌ను ఆయన తప్పుబట్టారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకి వెళ్లినట్లు ప్రింట్లు వచ్చాయని, ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల ప్రింట్లు ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేద చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని లాలూఈ సందర్భంగా డిమాండ్ చేశారు.