సోమ్‌దేవ్ ఓటమి
బ్యాంకాక్ : ఏటీపీ బ్యాంకాక్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ వర్మన్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ సోమ్‌దేవ్ 6-0, 5-7, 3-6 తేడాతో తైపీ ఆటగాడు టి చెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ మిగతా రెండు సెట్లను ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసినట్టయ్యింది. డబుల్స్ తొలి రౌండ్లోనే సోమ్‌దేవ్, జిమ్మీ వాంగ్ (తైపీ) జోడి వెనుదిరిగింది.