atracity
-
టీడీపీ నేత దాష్టీకం.. దళిత దంపతులపై దాడి
పెదకూరపాడు: ప్రశ్నించిన దళితులపై టీడీపీ నేతలు, సానుభూతి పరుల దాడులు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పొలం వద్ద జరిగిన చిన్న వాగ్వాదం విషయమై మాట్లాడదాం రండి అని దళిత దంపతులను పిలిచి, కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషించి, పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం హుస్సేన్‌నగరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని హుస్సేన్‌నగరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన సాతులూరి లక్ష్మయ్య, దేవకరుణ దంపతులు కౌలుకు పొలం సాగు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఆ పొలంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నెల్లూరు బుల్లెబ్బాయి గోర్రు తోలారు. 13వ తేదీ సాయంత్రం లక్ష్మయ్య, దేవకరుణ పొలం చూసేందుకు వెళ్లగా.. గోర్రు సక్రమంగా తోలకపోవడంతో బుల్లెబ్బాయిని ప్రశి్నంచారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయమై మాట్లాడదాం రండి అని దంపతులను గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు నెల్లూరు మల్లికార్జునరావు తన ఇంటికి అదే రోజు సాయంత్రం పిలిపించారు. దంపతులు జరిగిన విషయం చెబుతుండగానే.. పొలంలో గొర్రు తోలిన నెల్లూరు బుల్లెబ్బాయి లక్ష్మయ్యను మాపై ఫిర్యాదు చేస్తావురా అంటూ కాలితో తన్నగా.. బుల్లెబ్బాయి కుటుంబసభ్యులు నెల్లూరి బోస్‌బాబు, శివయ్య, రోశయ్య, పవన్, అరుణ, రమాదేవి, రమాదేవి కోడలు, బుల్లెబ్బాయి భార్య కర్రలతో దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్గంమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో దళిత దంపతులు అర్ధరాత్రి సమయంలో అమరావతి మండలం అత్తలూరు మీదగా 75తాళ్ళూరు వచి్చ, అక్కడ నుంచి పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదకూరపాడు సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించుకుని.. అమరావతి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు. -
లవర్‌కి గిఫ్ట్‌గా ఫోన్ ఇచ్చాడని మరీ ఇంత దారుణమా..
జబల్పూర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్ ఫ్రెండ్‌కి మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడని దారుణానికి తెగబడ్డారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఫోన్ కొనిచ్చిన యువకుడు, అతని స్నేహితుడి పట్ల అమానవీయంగా అవమానించారు. అమానవీయం అగ్రవర్ణానికి చెందిన అమ్మాయికి ఫోన్ ఇచ్చినందుకు గాను ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు. ఆ తర్వాత వారి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంతటితో ఆగకుండా ఇద్దరిని నేలపై ఉమ్మించి ఒకరి ఉమ్మును మరొకరి చేత నాకించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లో మే 22 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫోన్ ఇచ్చాడని జబల్పూర్ జిల్లాలో దామన్ ఖమారియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ మెహ్రా అనే దళిత యువకుడు అదే ఊరిలో అగ్రవర్ణానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి కుదరడం లేదని, తనకో ఫోన్ కొనివ్వాలంటూ ఆ అమ్మాయి కోరింది. దీంతో రాజ్‌కుమార్ తన స్నేహితుడైన మహేంద్రకు చెందిన ఫోన్‌ను ఆ అమ్మాయికి ఇచ్చాడు. విచక్షణ కోల్పోయారు ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆమెను విచారిస్తే ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరు దళిత యువకులను నిర్బంధించి దారుణానికి తెగబడ్డారు. -
ఫలించిన పోతురాజు పోరాటం
– సాగుభూమిని రిజిస్టర్ చేసే విధంగా కలెక్టర్ ఆదేశాలు – దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు కర్నూలు (హాస్పిటల్)/రుద్రవరం: తమ కుటుంబం 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇతరులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ పోతురాజు చేసిన పోరాటం ఫలించింది. సాగుభూమిని బాధితుని కుటుంబానికి రిజిస్టర్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ రుద్రవరం తహసీల్దార్నుఆదేశించారు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ దళిత రైతు కిరణ్ బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో క్రిమసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం చేసింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోతురాజు కిరణ్‌ను పరామర్శించారు. ఆలమూరులో దాడికి సంబంధించిన ఉదంతాన్ని కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చెల్లించాలని ఆర్డీఓ రఘుబాబును కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వారు సాగు చేసుకుంటున్న భూమిని వారికే చెందేటట్లు రిజిస్టర్ చేయాలని చెప్పారు. కిరణ్‌పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు. -
అట్రాసిటీ కేసులపై విచారణ
తడ: ఇటీవల కాలంలో తడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు అట్రాసిటీ కేసులకు సంబంధించి బుధవారం ఆ విభాగం డీఎస్పీ సుధాకర్ విచారణ చేపట్టారు. అండగుండాల గ్రామ దళితులకు సంబంధించిన స్మశాన స్థలాన్ని చేనిగుంటకు చెందిన రైతు శ్రీనివాసులురెడ్డి ఆక్రమించే ప్రయత్నం చేశాడని కేసు నమోదు అయింది. ఈ కేసుతో పాటు తడకు చెందిన ఓ గిరిజన యువతిని తిరుపతికి చెందిన వ్యక్తి మోసం చేశాడనే ఫిర్యాదుపైనా విచారణ జరిపారు. అండగుండాలలో పొలాన్ని పరిశీలించిన అనంతరం తడలోని పున్నమి అతిథిగహంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు.