ats officer
-
‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి..
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఆమెను విచారిస్తున్న ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(యూపీ ఏటీఎస్)ముందు ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పబ్జీ ఆడుతూ భారత్‌కు చెందిన యువకుడు సచిన్ ప్రేమలో పడి, అక్రమంగా నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన సీమాకు సంబంధించిన పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సీమా సోదరుడు, మామ పాక్ ఆర్మీ సభ్యులు తాజాగా సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. అలాగే ఆమె మామ గులాం అక్బర్ కూడా పాక్ పాక్ సైన్యంలోనే పనిచేస్తున్నాడని తేలింది. ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, అతని సోదరి, తన భార్య అయిన సీమా తరచూ మాట్లాడుకునేవారనే విషయాన్ని సీమా భర్త గులాం అధికారుల సమక్షంలో వెల్లడించాడు. సీమా మామ పాక్ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఆయన ఇస్లామాబాద్‌లో ఉంటున్నాడని గులామ్ తెలిపాడు. సీమా హైదర్‌కు పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో గల సంబంధాలపై ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఢిల్లీలో మరికొంతమందితో ఆమెకు పరిచయం యూపీకి చెందిన సచిన్ మీనా అనే యువకుడి ప్రేమలో పడ్డానంటూ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాక్ మహిళ సీమా గులాం హైదర్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) పోలీసులు విచారిస్తున్నారు. పాక్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన తర్వాత సీమా ముందుగా సచిన్ మీనాను కలుసుకోలేదని విచారణలో తేలింది. ఆమెకు రాజధాని ఢిల్లీలో మరికొంతమందితో పరిచయం ఉన్నన్నదని ఏటీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎస్ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఎంతో ఆలోచించి తెలివిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి! ఆశ్యర్యపరుస్తున్న సీమా ఆంగ్ల పరిజ్ఞానం విచారణలో సీమా హైదర్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి కీలక విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులభం కావడంలేదని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమాకు గల ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. ఇదిలావుండగా సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి అక్కడికి పంపాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెసేజ్ చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పాక్ పంపించండి: భర్త వేడుకోలు యూపీ ఏటీఎస్ అధికారుల విచారణకు ముందు సీమా ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివాసం ఉంటున్నందున సీమాను నోయిడా పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్‌తోపాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ప్రస్తుతం ఈ ముగ్గురిని యూపీ ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా సీమా తాను పూర్తిస్థాయిలో హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని పోలీసులకు తెలిపింది. అయితే ఆమెను ఎలాగైనా పాక్‌కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్ పోలీసులను కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
నేరం చేసానని ఒప్పుకోమని హింసిస్తున్నారు
న్యూఢిల్లీ : ‘2008, మాలేగావ్ పేలుళ్ల కేసు’లో ప్రధాన నిందుతుడుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ గతంలో రాసిన ఒక ఉత్తరం ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో కలకలం రేపుతుంది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందుతుడిగా మహారాష్ట్ర ‘యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్’(ఏటీఎస్) కస్టడీలో ఉన్న సమయంలో ఏటీఎస్ అధికారులు తనను విపరీతంగా టార్చర్ చేస్తున్నారని 2013, డిసెంబర్లో ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’కు ఓ 24 పేజీల లేఖ రాసాడు పురోహిత్. నావీ ముంబై జైల్లో ఏటీఎస్ కస్టడీలో ఉన్నప్పుడు వారు తనను బలవంతంగా నేరం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను ఏ నేరం చేయలేదని కానీ ఏటీఎస్ అధికారులు మాత్రం తనను కొట్టి, హింసించి తన చేత బలవంతంగా నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపాడు. కేవలం ఏటీఎస్ అధికారులు మాత్రమే కాక ఆర్మీ అధికారులు కూడా తనను హింసించారని, అంతేకాక తనచేత బలవంతంగా మరో ఆరుగురు అధికారుల పేర్లను కూడా చెప్పించారని పేర్కొన్నాడు. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుళ్లలో ఏడుగురు మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్టయిన పురోహిత్‌కు గతేడాది సెప్టెంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పురోహిత్ రాజకీయ కుట్రల వల్లనే తాను తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపానని తెలిపాడు. పురోహిత్ రాసిన లేఖ గురించి పోలీసు అధికారులు ‘పురోహిత్ ఈ లేఖను 2013లో రాసాడు...అప్పుడే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని దర్యాప్తు చేసింది. అంతేకాక పురోహిత్ లేఖలో పేర్కొన్న అధికారులు కూడా పురోహిత్ ఆరోపణలపై స్పందించార’ని పోలీసు అధికారులు తెలిపారు. -
విధినిర్వహణలోనే విగత జీవిగా..
సాక్షి, లక్నో : యూపీలో ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అధికారి లక్నోలోని తన కార్యాలయంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏటీఎస్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ సాహ్ని తన కార్యాలయంలో అనుమానాస్పద రీతిలో మరణించారు.అయితే గన్‌తో కాల్చుకుని ఆయన మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందగానే యూపీ సీనియర్ అధికారులు ఏటీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అధికారిక తుపాకీతో ఆయన తనను తాను షూట్ చేసుకుని ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాహ్ని ఉత్తరాఖండ్‌లో ఇటీవల పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారిని నిర్బంధించడంలో కీలక పాత్ర పోషించారు. ఏటీఎస్ సీనియర్ అధికారి ఎందుకు ఇంత తీవ్ర చర్యకు పాల్పడ్డారనే కారణాలు ఇంకా వెల్లడికాలేదు. -
కారులో పోలీసు, మహిళ అనుమానాస్పద మృతి!
రాజస్థాన్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లోని ఓ ఉన్నతాధికారి, మరో మహిళ అనుమానాస్పద స్థితిలో ఓ కారులో మరణించారు. వాళ్లిద్దరి మృతదేహాలు కారులో కనిపించాయి. రాష్ట్ర రాజధాని జైపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివదాస్‌పురా ప్రాంతంలో రోడ్డుపక్కన పార్కింగ్ చేసి ఉన్న కారులో అదనపు ఎస్పీ ఆశిష్ ప్రభాకర్, మరో గుర్తుతెలియని మహిళ మరణించి ఉన్నారు. ఆ మహిళ ఎవరన్న విషయం ఇంతవరకు తెలియలేదు. ప్రభాకర్ సర్వీస్ రివాల్వర్ నుంచి వచ్చిన తూటాల కాల్పులతోనే ఇద్దరూ మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్పారు. ఒక మహిళ కారులో మరణించి పడి ఉందని గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రభాకర్ ఫోను నుంచి పోలీసు కంట్రోల్‌రూంకు ఫోన్ వచ్చింది. పోలీసులు అక్కడకు వెళ్లి చూసేసరికి ప్రభాకర్ మృతదేహం ఆ ఎస్యూవీ డ్రైవింగ్ సీటులో ఉంది. ఆ మహిళ మృతదేహం ప్రభాకర్ ఒళ్లో పడి ఉంది. కారులో కొన్ని ఖాళీ బీరు క్యాన్లు కనిపించాయి. పోలీసులు అక్కడకు వెళ్లేసరికి కారు లోపలి నుంచి తాళం వేసి ఉందని డీసీపీ మనీష్ అగర్వాల్ తెలిపారు. ప్రభాకర్ సర్వీసు రివాల్వర్ నుంచి రెండు రౌండ్ల్ కాల్పులు జరిగాయని, ఇది ఆత్మహత్యా.. లేక మరేమైనా అయి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ప్రభాకర్‌కు గతంలో ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంస్థ ఉండేదని, ఆ మహిళ అక్కడ చదువుకుందని, బహుశా ఇద్దరి మధ్య అప్పటినుంచి సంబంధం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలం పాటు చదువుకోసం సెలవు తీసుకున్న తర్వాత ప్రభాకర్ ఇటీవలే ఏటీఎస్‌లో చేరారు. ఆయనకు ఇప్పటికే పెళ్లయింది.