
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, లక్నో : యూపీలో ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అధికారి లక్నోలోని తన కార్యాలయంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏటీఎస్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ సాహ్ని తన కార్యాలయంలో అనుమానాస్పద రీతిలో మరణించారు.అయితే గన్‌తో కాల్చుకుని ఆయన మరణించి ఉంటారని భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందగానే యూపీ సీనియర్ అధికారులు ఏటీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అధికారిక తుపాకీతో ఆయన తనను తాను షూట్ చేసుకుని ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాహ్ని ఉత్తరాఖండ్‌లో ఇటీవల పాకిస్తాన్ ఐఎస్‌ఐ గూఢచారిని నిర్బంధించడంలో కీలక పాత్ర పోషించారు. ఏటీఎస్ సీనియర్ అధికారి ఎందుకు ఇంత తీవ్ర చర్యకు పాల్పడ్డారనే కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment