attack with knifes
-
ఎంత ఫ్రెండయితే నా పెళ్లాన్నే తిడతాడా?
అనంతపురం క్రైం: భార్యను దూషించాడనే కోపంతో స్నేహితుడిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం అనంతపురంలోని పాతూరు బంగారు వీధిలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన మేరకు... మునిదేవ్ అలియాస్ దేవా, వెంకటేశ్ స్నేహితులు. దేవా 20 ఏళ్లుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నాడు. మూడు నెలల కిందటే అనంతపురానికి వచ్చాడు. వెంకటేశ్ టీవీ టవర్ వద్ద నివాసముంటున్నాడు. వీరిద్దరూ బంగారు వీధిలో దుకాణాల ముందు రోజు చెత్తాచెదారాన్ని ఊడ్చుతూ జీవనం సాగించే వారు. పని ముగించుకుని దేవా బంగారు వీధిలోనే నిద్రించేవాడు. ఏరోజుకారోజు వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో వెంకటేశ్ భార్యను దేవా తిట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్ తన వద్ద ఉన్న కత్తితో దేవాపై దాడి చేశాడు. దేవా శరీరంలో ఏడు చోట్ల కత్తి గాయాలయ్యాయి. కుడివైపు గొంతులో లోతుగా గాయమైంది. క్షతగాత్రుడిని పోలీసులు, స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. కాగా, దేవాను అంబులెన్స్ ఎక్కించే సమయంలో వెంకటేశ్ అక్కడే ఉంటూ సాయపడడం గమనార్హం. -
వింజమూరులో దారుణం
వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సుబ్బరత్తమ్మ, పొలిమేర సుబ్బమ్మ అనే ఇద్దరు మహిళలపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బరత్తమ్మ(41) అక్కడికక్కడే మృతి చెందగా.. సుబ్బమ్మకు తీవ్రగాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న సుబ్బమ్మను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు సుబ్బమ్మ అల్లుడు, ప్రత్యక్ష సాక్షి వెంగల్ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోడూరు పెద్ద నాగిరెడ్డి, కోడూరు చిన్న నాగిరెడ్డ్డి, సుంకిరెడ్డి నాగిరెడ్డి అనే ముగ్గురు దాడికి పాల్పడ్డినట్టు గుర్తించారు.