ముఖం మీద నూనె పోశాడు
సెల్ ఫోన్ విషయంలో కస్టమర్ తో గొడవ పడ్డ ఓ హోటల్ యజమాని అతడి ముఖం మీద వేడి నూనె పోశాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ మండలం గొల్లల మామిడాడలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ విషయంలో హోటల్ యజమాని సత్తిరెడ్డి, కస్టమర్ బుజ్జిలు వాదులాడుకున్నారు. ఓ స్థాయిలో విచక్షణ కోల్పోయిన సత్తిరెడ్డి.. బుజ్జి ముఖం మీద వేడివేడి నూనె పోశాడు. ఈ దాడిలో బుజ్జి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. నిందితుడు సత్తిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.