స్పీకర్ నాదెండ్ల ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు
గుంటూరు: తెనానిలో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని సమైక్యాంధ్రవాదులు ముట్టడించారు. స్పీకర్ పదవికి నాదెండ్ల మనోహర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ వారు నినాదాలు చేశారు.
రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రోజు నుంచి జిల్లాలో ముఖ్యంగా తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. రాష్ట్రం విభజించాలన్న ప్రతిపాదనకు నిరసనగా ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే స్పీకర్ ఇంటిని ముట్టడించారు. ఆయన రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.