attacks on crop
-
ననియాలతాండాలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు : రామకుప్పం వాసులకు ఏనుగుల బెడద తప్పేట్టులేదు. తరచూ గ్రామాలపై పడటంతో ఎప్పుడు ఏమౌతుందోనని వారు ఆందోళనలో చెందుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి నుంచి మండలంలోని ననియాల గ్రామం, ననియాల తాండాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోజూ రాత్రి అయ్యే సరికి ఊర్ల మీదపడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏనుగుల గుంపును అడవిలోకి తరమలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తూ మామిడి, అరటి తోటలతోపాటు టమాటా, బీన్స్ వంటి కూరగాయపంటలను నాశనం చేస్తున్నాయి. (రామకుప్పం) -
కొనసాగుతున్న గజరాజుల బీభత్సం
రామకుప్పం(చిత్తూరు) : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో గజరాజుల బీభత్సం గురువారం కూడా కొనసాగింది. రామకుప్పం మండలం పెద్దూరు, నన్యాల, రామాపురం తాండ, పీఎం తాండ పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. అరటి, బీన్స్, టమాటా పంటలకు భారీగా నష్టం జరిగింది. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. - రామకుప్పం