చిత్తూరు : రామకుప్పం వాసులకు ఏనుగుల బెడద తప్పేట్టులేదు. తరచూ గ్రామాలపై పడటంతో ఎప్పుడు ఏమౌతుందోనని వారు ఆందోళనలో చెందుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి నుంచి మండలంలోని ననియాల గ్రామం, ననియాల తాండాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోజూ రాత్రి అయ్యే సరికి ఊర్ల మీదపడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏనుగుల గుంపును అడవిలోకి తరమలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తూ మామిడి, అరటి తోటలతోపాటు టమాటా, బీన్స్ వంటి కూరగాయపంటలను నాశనం చేస్తున్నాయి.
(రామకుప్పం)
ననియాలతాండాలో ఏనుగుల బీభత్సం
Published Mon, Mar 9 2015 9:35 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement