రామకుప్పం(చిత్తూరు) : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో గజరాజుల బీభత్సం గురువారం కూడా కొనసాగింది. రామకుప్పం మండలం పెద్దూరు, నన్యాల, రామాపురం తాండ, పీఎం తాండ పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. అరటి, బీన్స్, టమాటా పంటలకు భారీగా నష్టం జరిగింది. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
- రామకుప్పం
కొనసాగుతున్న గజరాజుల బీభత్సం
Published Thu, Mar 5 2015 10:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement