Attarintiki Daredi Telugu Movie
-
‘అత్తారింటికి దారేది’ పైరసీ కేసులో 12 మంది అరెస్ట్
సాక్షి, మచిలీపట్నం: ‘ అత్తారింటికి దారేది’ సినిమా పైరసీపై 12మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ కె.వి.శ్రీనివాస్ తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన ఈ సినిమా పైరసీ సీడీని రూ.50కే అమ్మకాలు సాగించిన తీరుపై సోమవారం పెడన, బందరులో దాడులు చేసి పలు ఇంటర్నెట్, సెల్‌పాయింట్లు నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. మంగళవారం సుమారు 30 మందిని విచారించారు. వారిలో 12 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకోవడమేగాక పెడనకు చెందిన ఒకరిని హైదరాబాద్ తీసుకెళ్లారు. పెడనలోని దేవి మొబైల్స్ నిర్వాహకుడు అనిల్‌పై అనుమానంతో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
‘అత్తారింటికి దారేది’ లేటెస్ట్ స్టిల్స్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఈ చిత్రంలో.. పవన్ కళ్యాణ్ సరసన సమంతా జోడీగా నటించింది.పవన్ కళ్యాణ్, సమంతా జోడీ ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టించనుందా..!ఈ ఆరడుగుల బుల్లెట్ ప్రేక్షకుల ముందుకు త్వరలో దూసుకురానుంది. చిత్రంలోని ఓ దృశ్యం.. జల్సా తరువాత త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో.. ఈ చిత్రం మరో సూపర్ డూపర్ హిట్... కానుందా...!!చిత్రంలోని ఓ సన్నివేశం...సమంతా.. చిరునవ్వుతో..సమంతా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించనుంది.ఈ సినిమాలో త్రివిక్రమ్ సృష్టించిన డైలాగులు అదుర్స్ ..`కాటమురాయుడా...` అంటూ పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను.. అలరిస్తోంది.చూడు సిద్దప్పా.. సింహం గడ్డం గీసుకోదూ... అంటూ పవన్ చెప్పినా.. డైలాగ్.. టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. భారీ అంచనాలతో... వస్తున్న .. ఈ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఏ మేరకు.. ఆకట్టుకుంటుందో.. !!