audiance
-
వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!
‘‘నాకు తెలిసిన ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ కొండా మురళిగారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి, సినిమా గురించి చెబితే వారు ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌పై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొండా మురళి, సురేఖల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు (1990 నుంచి 2000) ఈ సినిమా ఉంటుంది. కొండా దంపతుల కుమార్తె సుష్మిత ఈ చిత్రనిర్మాత కాబట్టి వాళ్లకు పాజిటివ్‌గా తీయలేదు.. తను నిర్మాత కాకున్నా నేను అనుకున్నది తీసేవాణ్ణి. ప్రస్తుతం ‘లడకీ’ అనే ఓ హిందీ చిత్రం తీశాను. అమితాబ్ బచ్చన్‌గారితో ఓ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం.. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. నాలుగు నెలల క్రితం ‘సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారు’ అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
ఆడియన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఆ రోజు వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ రోజు (మే 12న) విడుదలైంది. ఈ మూవీ చూసేందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కుడుతున్నారు. యాక్షన్-కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతం అందించాడు. చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్ ఇదిలా ఉంటే మూవీ విడుదలకు కొద్ది గంటల ముందు ‘సర్కారు వారి పాట’ మూవీ టీం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని చిత్రం బృందం కోరింది. అలాగే ఎవరైనా, ఎక్కడైనా మూవీ పైరసీకి పాల్పడినట్లు మీ దృష్టికి వస్తే 89786 50014,99124 25159, 88811 08888 నంబర్లకు వాట్సాప్ ద్వారా, యాంటిపైరసీ.కామ్ (antipiracysolution) సమాచారం ఇవ్వాలని పేర్కొంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు #SarkaruVaariPaata Anti Piracy Control Room: Report piracy at claims@antipiracysolutions.org Whatsapp: 8978650014 9912425159 8881108888 — Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2022 -
భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!
ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత, భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల టీజే టిల్లు సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన కాస్తా నోటి దురుసు చూపించాడు. ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడాడు. దీంతో అతడి మాటలకు ఆడియన్స్ నొచ్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల విశాఖపట్నంలో జరిగి డీజే టిల్లు సక్సెస్ మీట్‌తో నాగవంశీ ప్రేక్షకులను ‘వాడు, వీడు’ అంటూ మాట్లాడాడు. దీంతో ఆయన తీరు మాటలు ప్రేక్షకులను ఇబ్బంది కలిగించాయి. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఈ విషయం తెలిసి నాగవంశీ ట్విటర్ వేదిక క్షమాపణలు కోరాడు. ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రక్షకులకు ఇబ్బంది కలిగించాయనే వార్తలు తెలిసి బాధపడ్డాను’ అంటూ ఆయన నోట్ విడుదల చేశాడు. అలాగే సోదర భావంతోనే వారిని అలా ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడానని, అయినా వారి మనసునొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడినయ్యానన్నాడు. ‘ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం, వారే మా బలం’ అంటూ నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. చదవండి: ఓటీటీలో ‘96’ తెలుగు వెర్షన్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. 🙏 pic.twitter.com/WzjueNtDOw — Naga Vamsi (@vamsi84) February 18, 2022 -
చారిత్రక నాటక వైభవానికి నాందీవాక్యం
కొమురం భీం ప్రదర్శనపరంగా ప్రేక్షకులను విశేషంగా కదిలించింది. కానీ ఇతివృత్తాన్ని బట్టి మరింత యోగ్యంగా ప్రదర్శించే అవకాశాలు ఈ నాటకానికి ఉన్నాయి. ప్రయోగం కూడా మూస స్థాయికి చేరుకుందని పరిషత్ నాటకాల మీద వచ్చిన విమర్శ. ప్రయోగం కోసం ప్రయోగం అన్న ధోరణితో పరిషత్ నాటకాలు కొద్దికాలంగా ఆకర్షణను కోల్పోయిన మాటను ఎవరూ కాదనలేరు. 80వ దశకంతో చూస్తే ఇవాళ పరిషత్ నాటకం చాలా వెనుకబడిందనే అనాలి. నిజానికి రంగస్థలమే ఆదరణను కోల్పోయింది. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు మాత్రం ప్రయోగాన్నీ, సంప్రదాయాన్నీ కూడా గౌరవిస్తున్నాయి. మే నెలలో రాజమండ్రిలో జరిగిన నంది నాటకోత్సవాలు దీనినే రుజువు చేశాయి. ఇందులో చారిత్రక ఇతివృత్తాలతో వచ్చిన రెండు నాటకాలకు (డొక్కా సీతమ్మ, కొమురం భీం) ప్రేక్షకులు నీరాజనాలు పట్టడం ఆహ్వానించదగిన పరిణామం. చారిత్రక ఘట్టాలను ప్రతిభావంతుడైన రచయిత నాటకంగా మలిస్తే ఆ రచన కావ్య స్థాయికి చేరి, ప్రేక్షకులకు రసానుభూతిని కలిగిస్తుంది. మంచి దర్శకుడి చేయూత ఉంటే ప్రదర్శన కూడా చరిత్రాత్మకమవుతుంది. ‘డొక్కా సీతమ్మ’ నాటకం అలాంటిదే. ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చే బంగారు నంది సహా పలు విభాగాలలో ఈ నాటకానికి పురస్కారాలు లభించాయి. గంగోత్రి, పెదకాకాని బృందం ఈ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ‘ఖుర్బానీ’, ‘బొమ్మా-బొరుసా’, ‘ప్రేమకు పద్దెనిమిదేళ్లు’, ‘హంస కదా నా పడవ’ (ఉత్తమ రచన), ‘పేదోడు’ వంటి నాటకాలు కూడా ఈ విభాగంలో పోటీ పడినాయి. రచన పరంగా డొక్కా సీతమ్మ మంచి ప్రమాణాలతో కనిపిస్తుంది. ప్రేక్షకులను వర్తమానం నుంచి గతంలోకి రచయిత ‘పినాకపాణి’ (రామకృష్ణరాజు) తీసుకుపోయే తీరు హృద్యంగా ఉంది. నాయుడు గోపి దర్శకత్వం వహించారు (సీతమ్మ భర్త జోగన్నపంతులు పాత్ర కూడా ఆయనే ధరించారు). ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అక్కడి పార్లమెంట్లో డొక్కా సీతమ్మ చిత్రపటం చూసి, విస్తుపోయిన జీఎంసీ బాలయోగి (ఒకప్పుడు లోక్‌సభ స్పీకర్, తరువాత దుర్మరణం పాలైనారు) స్వదేశం వచ్చాక ఆమె కుటుంబీకుల ద్వారా ఆమె గాథను తెలుసుకున్నట్టు రచయిత చిత్రించారు. అనన్య సామాన్యమైన సీతమ్మ (1841-1909) దాతృత్వాన్ని విని ఎడ్వర్డ్ ప్రభువు ‘ద మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని కీర్తించి ఆమె చిత్రపటాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఆవిష్కరించడం చారిత్రక వాస్తవం. తూర్పు గోదావరి జిల్లా, లంకల గన్నవరం అనే కుగ్రామంలో ఆమె అన్నదాన కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ఆమెకు కులమత భేదాలు లేవు. ఎవరి దగ్గరా నయాపైసా తీసుకోలేదు. పైగా గోదావరి జిల్లాలను మలమలలాడించిన కరువు కాలంలో ఆమె నిరంతరాయంగా అన్నదానం చేసి చరిత్రకెక్కారు. అందుకు సంబంధించిన ఉదంతాలను నేటికీ ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. గోదావరి పొంగింది. అలాంటి సమయంలో అవతలి ఒడ్డు నుంచి ‘సీతమ్మ తల్లీ, ఆకలి’ అన్న ఆర్తనాదం వినిపించింది. అతడొక దళితుడు. సీతమ్మ వెంటనే అన్నం, బట్టలు పట్టుకుని, భర్త జోగన్నపంతులును తీసుకుని ఆవలి తీరానికి వెళ్లి అతడికి అన్నం పెట్టింది. ఇది కల్పనకు సైతం అందని వాస్తవ ఘటన. ఇలాంటి వాటితో నిండిన ఈ నాటకంలో కరుణరసం గోదారి పొంగులాగే కనిపించింది. ‘నువ్వు సముద్రం కన్నా పెద్ద అమ్మవు. మన పిల్ల గోదారి నీ దయను అడ్డుకోగలదా?’ వంటి మాటలు నాటకానికి వన్నె తెచ్చాయి. ‘అంతా దోచుకుపోయినా ఫర్వాలేదు. ఆకలితో మాత్రం వెళ్లకండి!’ అని దొంగలను కూడా ప్రేమతో కట్టడి చేసిన తల్లి సీతమ్మ. దీనితో పాటు, సర్ ఆర్థర్ కాటన్‌ను ఆమె సత్కరించే సన్నివేశం కూడా ప్రేక్షకులను అలరించింది. కొమురం భీం ప్రదర్శన పరంగా ప్రేక్షకులను విశేషంగా కదిలించింది. కానీ ఇతివృత్తాన్ని బట్టి మరింత యోగ్యంగా ప్రదర్శించే అవకాశాలు ఈ నాటకానికి ఉన్నాయి. స్వాతంత్య్రేచ్ఛను వ్యక్తీకరించే ఇలాంటి ఇతివృత్తానికి అవసరమైన లోతు కొద్దిగా లోపించిందని అనిపిస్తుంది. నిజాం ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన గిరిజన నాయకుడు భీం కథకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉద్వేగాలను ప్రదర్శించడమే చారిత్రక నాటకానికి కీలకమన్న భావన ఇందులోని చిరు లోపం. దీనితో ఇతివృత్తం ఆత్మ ప్రేక్షకునికి అందకుండా పరారైపోతుంది. ఖుర్బానీ తృతీయ ఉత్తమ ప్రదర్శనకు ఎంపికైంది. మరుగున పడిందని భావిస్తున్న చరిత్రను ఇలా రంగస్థలం అక్కున చేర్చుకోవడం శుభపరిణామం. ఈ పంథా కొనసాగాలి. - కల్హణ ఫొటోలు: గరగ ప్రసాద్