Mythri Movie Makers: Sarkaru Vaari Paata Movie Team Urges Audience About Piracy - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: ఆడియన్స్‌కు మూవీ టీం విజ్ఞప్తి.. ‘దయచేసి అలా చేయకండి’

Published Thu, May 12 2022 1:38 PM | Last Updated on Thu, May 12 2022 5:29 PM

Sarkaru Vaari Paata Movie Team Urges Audience About Piracy - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఆ రోజు వచ్చేసింది. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ రోజు (మే 12న) విడుదలైంది. ఈ మూవీ చూసేందుకు సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ థియేటర్లకు క్యూ కుడుతున్నారు. యాక్షన్‌-కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించింది. తమన్‌ సంగీతం అందించాడు. 

చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది: అల్లు అరవింద్‌

ఇదిలా ఉంటే మూవీ విడుదలకు కొద్ది గంటల ముందు ‘సర్కారు వారి పాట’ మూవీ టీం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని చిత్రం బృందం కోరింది. అలాగే ఎవరైనా, ఎక్కడైనా మూవీ పైరసీకి పాల్పడినట్లు మీ దృష్టికి వస్తే 89786 50014,99124 25159, 88811 08888 నంబర్లకు వాట్సాప్‌ ద్వారా, యాంటిపైరసీ.కామ్‌ (antipiracysolution) సమాచారం ఇవ్వాలని పేర్కొంది. 

చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement