ఏఐవైఎఫ్ కార్యకర్తల కవాతు
ఏలూరు(సెంట్రల్): అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 20వ మహాసభలను జయపద్రం చేయాలని కోరుతూ కార్యకర్తలు శుక్రవారం నగరంలో కవాతు నిర్వహించారు. తొలుత స్ఫూర్తిభవన్ వద్ద కవాతును సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ జెండ ఊపి ప్రారంభించారు. మతోన్మాద శక్తులను అణిచివేస్తాం.. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షిస్తాం అనే నినాదంతో కార్యకర్తలు ఎరచొక్కాలు ధరంచి రమామహాల్, విజయవిహార్, ఫైర్‌స్టేషన్ సెంటరు మీదుగా కొత్తబస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు.
ప్రభాకర్ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ 58 ఏళ్ల ఉద్యమాలతో దేశ రాజకీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు, ఉపాధి హక్కుల సాధనకు పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆగష్టు 29,30,31 తేదీల్లో ఏలూరులో జరిగే సభల విజయవంతానికి సహకరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు బొద్దాని కృష్ణకిషోర్, ఉప్పులూరి హేమశంకర్, తొర్లపాటి బాబు, బాడిశ రాము, టి.అప్పలస్వామి, సీపీఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాసడాంగే, పుప్పాల కన్నబాబు, కె.కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.