భారత్తో సిరీస్కు క్లార్క్ దూరం
మెల్బోర్న్: వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ భారత పర్యటననుంచి తప్పుకున్నాడు. కొంత కాలంగా గాయంతో బాధ పడుతున్న క్లార్క్ ఈ టూర్కు రావడం మొదటినుంచీ అనుమానంగానే ఉంది.
అతని ఫిట్నెస్ను బట్టే తుది నిర్ణయం తీసుకుంటామని గతంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇప్పుడు ఆసీస్ సెలక్టర్లు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. క్లార్క్ స్థానంలో వన్డే జట్టులో కాలమ్ ఫెర్గూసన్ను, టి20 మ్యాచ్ కోసం నిక్ మాడిసన్ను ఎంపిక చేశారు. జార్జ్ బెయిలీ ఆసీస్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ టూర్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఒక టి20, ఏడు వన్డే మ్యాచ్లు జరుగుతాయి.