తెరమీదకు లాంగర్ పేరు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చింది. ఫ్లెచర్ వారసుడిగా అతను పగ్గాలు స్వీకరించే అవకాశాలున్నాయని ఓ కథనం చక్కర్లు కొడుతోంది. గతంలో ఆసీస్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పని చేసిన లాంగర్.. ప్రస్తుతం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ఛీప్ కోచ్గా పని చేస్తున్నారు.
ఆసీస్ తరఫున 105 టెస్టుల్లో 7696 పరుగులు చేసిన లాంగర్కు మంచి వ్యూహకర్తగా పేరుంది. మరోవైపు జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరి గురించి బీసీసీఐలోని ఉన్నతస్థాయి వ్యక్తులు చర్చించినట్లు సమాచారం.