ఆస్పత్రినుంచి హెన్రిక్స్ డిశ్చార్జ్
లండన్: కౌంటీ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్‌లో సహచరుడిని ఢీకొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ మొయిజెస్ హెన్రిక్స్ గాయంనుంచి కోలుకున్నాడు. ప్రమాదంలో అతని దవడకు గాయాలైన సంగతి తెలి సిందే. చికిత్స అనంతరం బుధవారం హెన్రిక్స్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ‘మొయిజెస్ ఇప్పుడు హాస్పిటల్నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. గురువారం హెన్రిక్స్ దంత వైద్యుడిని సంప్రదిస్తాడు’ అని అతని కౌంటీ జట్టు సర్రే ప్రకటించింది.