australian dog
-
సిల్కీ హెయిర్‌తో స్టయిలిష్ బ్లాకీ సంచలనం
మెల్బోర్న్: ఒళ్లంతా సిల్కీ సిల్కీ జుట్టుతో మెరిసిసోతూ...పట్టుకుంటే జారీపోయేలా..నల్లని జుట్టుతో మెరిసిపోతున్న ఓ శునకం తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. అఫ్ఘాన్ ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చెందిన అయిదేళ్ల ఆస్ట్రేలియా డాగ్ కు సోషల్ మీడియాలో ఇతర సూపర్ మోడల్స్‌ను మించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సాధిస్తోంది. ఒక్క ఫోటోతో సూపర్ మోడల్ గా మారిన ఈస్టయిలిష్ బ్లాకీ పేరు టీ. వివరాల్లోకి వెళితే.. టీ యజమాని ల్యూక్ కవనాగ్ సోషల్ మీడియాలో ఫోటోలుఅప్లోడ్ చేశాడు. అంతే మరుక్షణం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దాని అందానికి ముగ్ధులైన ఎంతోమంది డానికి అభిమానులుగా మారిపోతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ లో లక్షలకొద్దీ లైక్ లు షేర్లతో చక్కర్లుకొడుతోంది. దీంతో అనేక కంపెనీలు కూడా ఈ టీ కోసం క్యూ కట్టాయి. దీంతో శునకం రాజా యజమాని ల్యూక్ కవనాగ్ ,అతని కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. టీ చాలా అందంగా ఉంటుంది..అందుకే దాని ఫొటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాను.. దీంతో ఒక సూపర్ మోడల్ కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారని డెయిలీ టెలీగ్రాఫ్ .కాం ఒక నివేదికలో తెలిపింది. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. షో డాగ్ గా ఆకట్టుకున్న టీ ఇటీవల రీటైరయ్యిందట. తాజాగా యానిమల్ యాక్టర్ గా సెకండ్ కరియర్ మొదలు పెట్టింది. అయిదే ఫార్మల్ గా రిటైర్ అయిన టీ తో హాలీవుడ్ నటింప చేసే ఆలోచన ఏదీ లేదని తమకు తెలిపారని రిపోర్టు చేసింది. ఇప్పటికే ఈ శునకం ప్రముఖ శునక ఆహార కంపెనీ స్పోక్స్ డాగ్ కి ప్రచారకర్తగా డాగ్ పర్ ఫ్యూమ్ కంపెనీ హారియత్ అండ్ హౌండ్స్ యాడ్ ప్రచారంలో బిజీగామారింది. చాలామంది ఇంటర్నెట్ ప్రముఖులు కంటే ఎక్కువ సంచలనంగా మారిపోయిందని తెలిపింది. -
ప్రపంచంలోనే అత్యంత ముసలి కుక్క మరణం!
సాధారణంగా కుక్కలు 8 నుంచి 15 ఏళ్ల వరకు బతుకుతాయి. కానీ ఆస్ట్రేలియాలోని నైరుతి విక్టోరియా ప్రాంతంలో 30 ఏళ్లపాటు బతికిన ఓ కుక్క బుధవారం మరణించింది. మాగీ అనే ఈ శునకం చనిపోయి ఉండటాన్ని దాని యజమాని బ్రియాన్ మెక్లారెన్ గమనించారు. గత వారం కూడా అది బాగానే ఉందని, పిల్లులను చూసి గట్టిగా మొరిగిందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం చూస్తే అది చనిపోయి ఉందని, దాంతో తాను చాలా బాధపడుతున్నానని అన్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాస మరణం వచ్చినందుకు మాత్రం కాస్త ఊరటగా ఉందన్నారు. తన పెంపుడు శునకానికి 30 ఏళ్లు ఉన్నట్లు మెక్లారెన్ చెబుతున్నా, దానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు కాబట్టి దాని సరైన వయసు ఎంతో నిర్ధారణ కాలేదు. తన చిన్నకొడుకు నాలుగేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ కుక్కపిల్లను తెచ్చినట్లు మెక్లారెన్ చెబుతున్నారు. అతడికి ఇప్పుడు 34 ఏళ్లు. దాంతో ఆ కుక్క వయసు 30 ఏళ్లని అంటున్నారు. తామిద్దరం చాలా మంచి స్నేహితులమని అన్నారు. చెవులు వినిపించకపోయినా అది మాత్రం అతడి పొలానికి కాపలా ఉంటోంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో అది రోడ్డుమీద పడుకొని ఉండగా.. ఓ వాహనం కొట్టేయడంతో బాగా రక్తం పోయింది. కానీ ఎలాగోలా బతికింది.