పిడుగుపాటుకు ఆస్ట్రేలియా క్రీడాకారుడి దుర్మరణం
పిడుగుపాటుకు గురైన ఆస్ట్రేలియా యువ క్రీడాకారుడు స్టిఫాన్ పెట్రోవ్స్కీ(18) ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఏప్రిల్ 5న మలేసియాలోని మలక్కాలో పిడుగుపడటంతో సిడ్నీకి చెందిన యువ ఆటగాడు స్టిఫాన్ కోమాలోకి వెళ్లాడు. సాకర్ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నపుడు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అతనితోపాటూ మరో క్రీడాకారుడు మహ్మద్ అఫిక్ అజువాన్(21)కు స్పల్పగాయాలయ్యాయి. మూడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టిఫాన్ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందాడు.
ఆస్ట్రేలియా యువ గోల్ కీపర్ స్టిఫాన్ మృతి పట్ల ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా విచారం వ్యక్తం చేసింది. స్టిఫాన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. ప్రొఫేషనల్ ఫుట్ బాలర్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా కూడా తమ సంతాపాన్ని తెలిపింది.