Australian Open final
-
సబలెంకా... మళ్లీ చాంపియన్
మెల్బోర్న్: బెలారస్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 76 నిమిషాల్లో 6–3, 6–2తో చైనాకు చెందిన 12వ సీడ్ జెంగ్ కిన్వెన్పై గెలిచింది. విజేత సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు), రన్నరప్ జెంగ్ కిన్‌వెన్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసెట్లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకకు ఈ సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లను సాధించిన 25 ఏళ్ల బెలారస్ స్టార్ ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లను సంధించి, 14 విన్నర్లు కొట్టింది. 14 అనవసర తప్పిదాలు చేసింది. ఒక్కసారి కూడా డబుల్‌ఫాల్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆడింది. జెంగ్ 6 ఏస్‌లతో రాణించినప్పటికీ 6 డబుల్ ఫాల్ట్‌లు, 16 అనసవర తప్పిదాలతో టైటిల్‌కు దూరమైంది. గత 13 నెలల్లో ప్రతీ టోర్నీలోనూ మెరుగవుతున్న సబలెంకా జోరు ముందు ఏమాత్రం నిలువలేకపోయింది. గత సీజన్లో ఆరంభ గ్రాండ్‌స్లామ్ గెలిచిన బెలారస్ అమ్మాయి ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మధ్యలో ఫ్రెంచ్, వింబుల్డన్ ఓపెన్లలోనూ సెమీఫైనల్ వరకు పోరాడింది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలోనే ఓడి ఇంటిదారి పట్టిన 21 ఏళ్ల జెంగ్ కిన్వెన్ ఇప్పుడు ఆమె జోరుకు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. తద్వారా మళ్లీ ఈ ఏడాదీ కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అజరెంకా (2012, 2013) తర్వాత వరుస టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఘనతకెక్కింది. 2000 తర్వాత సెట్ కోల్పోకుండా ఇక్కడ విజేతగా నిలిచిన ఐదో క్రీడాకారిణిగా సబలెంకా నిలిచింది. -
చరిత్ర సృష్టించిన నాదల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్పై సంచలన విజయం
Rafael Nadal Wins Australian Open 2022 Singles Title: ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 పురుషుల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరిగా సాగిన ఈ పోరులో నదాల్ తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ.. అనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. మరోవైపు కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్‌పై గంపెడాశలు పెట్టుకున్న మెద్వెదెవ్.. నాదల్ అనుభవం ముందు నిలబడ లేకపోయాడు. మెద్వెదెవ్.. 2021లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్ హద్దాద్ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. అంతకుముందు పురుషుల డబుల్స్ ఫైనల్లో థనాసి కొకినాకిస్-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన విషయం తెలిసిందే. చదవండి: చెక్ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
సెరెనా మళ్లీ ఆడుతుందా!
►తల్లి కాబోతున్న టెన్నిస్ స్టార్ ►2017 సీజన్‌కు దూరం ►వచ్చే ఏడాది వస్తానని ప్రకటన లాస్ ఏంజెల్స్: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సోదరి వీనస్‌ను ఓడించి అత్యధిక గ్రాండ్‌స్లామ్ (23)ల విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచిన క్షణాన్ని టెన్నిస్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. కానీ ఆ సమయంలో సెరెనా రెండు నెలల గర్భవతి అంటే ఆశ్చర్యం కలుగుతుంది! తాను గర్భవతినని తెలిసీ బరిలోకి దిగిన సెరెనా... టైటిల్ గెలిచే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా కనబర్చిన ఆట, పట్టుదల అద్భుతం. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత మోకాలి గాయం అంటూ ఆమె రెండు ప్రధాన టోర్నీలనుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు తాను 20 వారాల గర్భవతినంటూ సెరెనా స్వయంగా ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. రెడ్ఇట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో గత డిసెంబర్లో సెరెనాకు నిశ్చితార్థం జరిగింది. ‘సెరెనా తల్లి కాబోతుందని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ సీజన్ మొత్తం ఆమె ఆటకు దూరం కానుంది. అయితే 2018లో మళ్లీ తిరిగి కోర్టులోకి అడుగు పెడుతుంది’ అని సెరెనా తరఫున ఆమె ప్రతినిధి బుష్ నోవాక్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన సెరెనాకు ఈ ఏడాది సెప్టెంబరుతో 36 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇక తన కెరీర్‌ను ముగించే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తుండగా... పునరాగమనం చేసి మళ్లీ చెలరేగిపోయే సత్తా సెరెనాలో ఉందని మరికొందరు చెబుతున్నారు. వచ్చే వారం ప్రకటించే తాజా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఆమె మరోసారి నంబర్‌వన్‌గా నిలవనుంది. అసాధ్యం కాదు... తల్లిగా మారి గతంలో పునరాగమనం చేసిన సంచలన క్రీడాకారిణులు టెన్నిస్‌లో చాలా మంది ఉన్నారు. అయితే వారిలో ముగ్గురు మాత్రం మళ్లీ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలవగలిగారు. దిగ్గజం మార్గరెట్ కోర్ట్ మొదటి పాపకు జన్మనిచ్చిన తర్వాత మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం విశేషం. ఎవాన్ గులగాంగ్ తల్లిగా మారిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో పాటు వింబుల్డన్ కూడా సొంతం చేసుకుంది. ఈతరం క్రీడాకారిణుల్లో కిమ్ క్లియ్‌స్టర్స్ కూడా అమ్మతనం అడ్డంకి కాదంటూ మూడు గ్రాండ్‌స్లామ్‌లను అందుకోవడం పెద్ద ఘనతగా చెప్పవచ్చు. అయితే సెరెనా విషయంలో వయసు మాత్రమే ప్రతిబంధకం కావచ్చనేది మాజీ ఆటగాళ్ల అభిప్రాయం. గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గకపోయినా... సర్క్యూట్లో కొనసాగుతూ పలు పెద్ద టోర్నీలు గెలిచినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా విక్టోరియా అజరెంకా కూడా గత ఏడాది కొడుకు పుట్టిన తర్వాత త్వరలోనే తిరిగి రానున్నట్లు ప్రకటించింది. డబ్బు కూడా వెంటే... మరో వైపు సెరెనా మాతృత్వంపై అప్పుడే వ్యాపార వర్గాల దృష్టి పడినట్లు సమాచారం. గర్భిణులు ధరించే ప్రత్యేక దుస్తులు, ఆ సమయంలో వాడే పోషక పదార్థాలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన అనేక ఉత్పత్తుల విషయంలో సెరెనా బ్రాండ్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం మ్యాచ్ ఫీజులు, బ్రాండింగ్‌ల ద్వారా సెరెనా ఆర్జన దాదాపు 29 మిలియన్ డాలర్లుగా ఉంది. -
అతడే నా ఫెవరెట్ ప్లేయర్: గంగూలీ
కోల్‌కతా: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫలితం ఏం రాబుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మేజర్ టోర్నీ ప్రారంభానికి ముందు స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్, స్విట్జర్లాండ్ మాస్టర్ రోజర్ ఫెడరర్ ఫైనల్లోకి వస్తారని టెన్నిస్ పండితులు కూడా భావించలేదు. అయితే టెన్నిస్ ఆటగాళ్లు, అభిమానులకే కాదు పలువురు మాజీ క్రికెటర్లకు ఈ ఇద్దరిలో టైటిల్ ఎవరు సాధిస్తారా అని కాస్త టెన్షన్ పట్టుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం తన ఓటు స్విస్ స్టార్ ఫెడరర్‌కే అని ప్రకటించాడు. ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ గెలిస్తే చూడాలని ఉందని జాతీయ మీడియాతో మాట్లాడుతూ గంగూలీ తన మనసులో మాటను బయటపెట్టాడు. టీమిండియా విషయానికొస్తే.. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అద్భుత ఫామ్ లో ఉన్నారని కితాబిచ్చాడు. నాగ్‌పూర్‌లో జరగనున్న రెండో ట్వంటీ20 కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండక పోవచ్చునని, తొలి టీ20 టీమ్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 1-0లో ఆధిక్యంలో ఉంది. -
జొకో జోరు.. సానియా హోరు.. సెరెనా హుషారు..
♦ వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో జొకోవిచ్ ♦ సెమీస్‌లో ఫెడరర్‌పై గెలుపు ♦ మిక్స్డ్ సెమీస్‌లో భారత స్టార్ ♦ 26వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అమెరికా స్టార్ మెల్బోర్న్: మేటి ప్రత్యర్థి ఎదురైనా... అద్వితీయమైన ఆటతీరుతో చెలరేగిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)... ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఈ టాప్‌సీడ్ ఆటగాడు 6-1, 6-2, 3-6, 6-3తో మూడోసీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలిచాడు. తాజా విజయంతో ముఖాముఖి రికార్డును 23-22తో మెరుగుపర్చుకోగా, వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం విశేషం. రెండు గంటలా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్... 17సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఫెడరర్ షాట్లకు కచ్చితమైన సమాధానం ఇచ్చాడు. 54 నిమిషాలలో ముగిసిన తొలి రెండు సెట్లలో కేవలం మూడు గేమ్స్ మాత్రమే చేజార్చుకున్నాడు. ఫెడరర్ ఫస్ట్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెర్బియన్ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆరో గేమ్‌లో కూడా ఫోర్‌హ్యాండ్‌తో ఫ్రెడ్డీ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా తొలి 14 పాయింట్లలో 12 గెలిచాడు. ఫెడరర్‌పై తొలి సెట్‌ను ఇంత సులభంగా గెలవడం జొకొవిచ్‌కు ఇదే మొదటిసారి. ఇక రెండో సెట్లోనూ మూడు, ఐదో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో జొకోవిచ్‌కు ఆధిక్యం లభించింది. మూడోసెట్లో దూకుడును చూపెట్టిన ఫెడరర్... ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను తొలిసారి బ్రేక్ చేశాడు. తర్వాత అదే ఒత్తిడిని కొనసాగిస్తూ... మూడోసెట్ పాయింట్‌తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. వర్షం పడే సూచనలు కనిపించడంతో స్టేడియం రూ్ఫ్ను మూసేవరకు ఇద్దరు ఆటగాళ్లు కాసేపు సేదతీరారు. ఇక నాలుగో సెట్లో అద్భుతమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో చెలరేగిన జొకోవిచ్ ఎనిమిదో గేమ్‌లో పదునైన ఫోర్‌హ్యాండ్ రిటర్న్‌తో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో ఇది ఐదోసారి. తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా జైత్రయాత్ర కొనసాగుతోంది. క్రొయేషియా భాగస్వామి ఇవాన్ డోడిగ్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-డోడిగ్ 7-6 (7/1), 6-3తో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో సానియా ద్వయం కాస్త తడబడింది. పేస్-హింగిస్ల సర్వీస్‌లను అడ్డుకునే ప్రయత్నంలో అనవసర తప్పిదాలు చేసింది. అయితే ఏకపక్షంగా సాగిన టైబ్రేక్‌లో మాత్రం అంచనాలకు మించి రాణించింది. సర్వీస్‌తో పాటు అద్భుతమైన వ్యాలీలతో చెలరేగింది. రెండోసెట్లో మరింత అప్రమత్తతతో వ్యవహరించిన ఇండో-క్రొయేషియా జోడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. అయితే ప్రత్యర్థుల సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కాచుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మ్యాచ్ మొత్తంలో సానియా జంట 12; పేస్ ద్వయం 18సార్లు అనవసర తప్పిదాలు చేశారు. తమ సర్వీస్‌లో 76 శాతం పాయింట్లు సాధించిన సానియా-డోడిగ్... రెండో సర్వీస్‌లో మాత్రం 61 శాతమే నెగ్గారు. శుక్రవారం జరిగే సెమీస్‌లో సానియా జంట... ఐదోసీడ్ ఎలెనా వెస్నినా (రష్యా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో తలపడతారు. మరోవైపు సానియా-హింగిస్ జోడి ఇప్పటికే మహిళల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా నేడే జరగనుంది. ఏడోసీడ్ చెక్ జోడి ఆండ్రియా హల్వకోవా-లూసి హర్డెకాతో వీళ్లు తలపడతారు. పదునైన సర్వీస్‌లు.. తిరుగులేని రిటర్న్... బలమైన బేస్‌లైన్ ఆటతో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 6-0, 6-4తో నాలుగోసీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలెండ్)ను చిత్తు చేసింది. సెరెనాకు ఇది 26వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇది ఏడోసారి. ఓవరాల్‌గా కెరీర్లో 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా... ఓపెన్ ఎరాలో స్టెఫీగ్రాఫ్ (22) రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలో క్లీన్ విన్నర్‌తో బ్రేక్ పాయింట్ సాధించిన సెరెనా.... 64 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. తన సర్వీస్ పవర్‌ను చూపెట్టిన అమెరికా స్టార్ నెట్ వద్ద సూపర్ స్మాష్‌తో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ప్రత్యర్థి సర్వీస్‌ను అడ్డుకునే ప్రయత్నంలో రద్వాన్‌స్కా డబుల్ ఫాల్ట్ చేయడంతో ఆధిక్యం 3-0కు పెరిగింది. కొన్నిసార్లు సెరెనా కొట్టిన కచ్చితమైన షాట్లకు పోలెండ్ అమ్మాయి కోర్టులో పరుగెత్తలేకపోయింది. దీంతో 17 నిమిషాల్లోనే సెరెనా స్కోరు 5-0కు పెరిగింది. తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న అమెరికా ప్లేయర్ మరో మూడు నిమిషాల్లో సెట్‌ను ముగించింది. రెండో సెట్లో సెరెనా బేస్‌లైన్ నుంచి కొట్టిన షాట్ నెట్‌కు తగలడం, ఆ వెంటనే రద్వాన్‌స్కా సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఇరువురు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 3-3తో సమమైంది. డ్యూస్ వరకు వెళ్లిన ఏడో గేమ్‌లో రద్వాన్‌స్కా, ఎనిమిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. అయితే తొమ్మిదో గేమ్‌లో మరోసారి తడబడిన పోలెండ్ ప్లేయర్ సర్వీస్‌ను చేజార్చుకుంది. దీంతో స్కోరు 5-4గా మారింది. ఇక పదో గేమ్‌లో సెరెనా మూడు ఏస్‌లతో తొలి మ్యాచ్ పాయింట్‌ను సాధించింది. మరో సెమీస్‌లో ఏడోసీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 6-2తో జొహానా కొంటా (బ్రిటన్)పై నెగ్గింది. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో నా లీ, సిబుల్కోవా
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ పోరుకు చైనా స్టార్ నా లీ, స్లోవికియా తార డొమినికా సిబుల్కోవా సిద్ధమయ్యారు. రెండుసార్లు రన్నరప్ అయిన నా లీ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారమిక్కడ జరిగిన సెమీ ఫైనల్లో కెనడా యువ క్రీడాకారిణి యుజీన్ బౌచర్డ్ను వరుస సెట్లలో ఓడించింది. 6-2, 6-4తో చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో 20వ సీడ్ సిబుల్కోవా, 5వ సీడ్ రద్వాన్‌స్కాను కంగుతినిపించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. 70 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ 6-1, 6-2తో రద్వాన్‌స్కాను సిబుల్కోవా ఓడించింది. మేజర్ టెన్నిస్ టోర్నిలో ఆమె ఫైనల్ ప్రవేశించడం ఇదే మొదటిసారి.