సెరెనా vs షరపోవా
నేడు మహిళల ఫైనల్
మ. గం. 2.00 నుంచి
సోనీ సిక్స్‌లో లైవ్
కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొరకు సెరెనా... సెరెనా చేతిలో వరుసగా ఎదురైన 16 పరాజయాల పరంపరకు తెరదించాలనే లక్ష్యంతో షరపోవా... శనివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు.
గతంలో సెరెనా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ విజేతగా నిలిచింది. మరోవైపు 2004 నుంచి సెరెనాపై ఏ టోర్నీలోనూ షరపోవా నెగ్గలేకపోయింది.